Sagar Chandra
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా 'లగ్గం టైమ్'.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తోన్న చిత్రం లగ్గం టైమ్. ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె.హిమ బిందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర చేతుల మీదుగా పోస్టర్‌ను విడుదల చేశారు.పోస్టర్ చూస్తుంటే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు. ప్రేమ, వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని మేకర్స్ అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే లగ్గంటైమ్కు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టి, డైరెక్టర్ పరశురామ్‌తో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్ కెరీర్లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
Bheemla Nayak: ఆ సీన్ తొలగించి, పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి
పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలోని పలు సన్నివేశాలపై కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డాక్టర్ మానేపల్లి వీవీఎస్ఎన్ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సన్నివేశాలని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వివరాల్లొకి వెళితే.. భీమ్లా నాయక్ మూవీలో రానా-పవన్ కల్యాణ్‌ల మధ్య చిత్రీకరించిన ఫైటింగ్ సీన్లో ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను రానా కాలితో తన్నారు. ఇది తమ వర్గాన్ని అవమానించేలా ఉందని మానేపల్లి వీవీఎస్ఎన్ మూర్తి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఫైటింగ్ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని(సారె) కాలితో తన్ని దానితో పవన్‌పై దాడి చేసినట్లు చూపించారు. మేము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటి సారెను కాలితో తన్నినట్లు చూపించడం మమ్మల్ని కించపరచడమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది’ అని ఆయన అన్నారు. అంతేకాదు ఈ సన్నివేశాన్ని వెంటనే మూవీ నుంచి తొలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సినిమా హీరోలు పవన్ కల్యాణ్, రానా, దర్శక-నిర్మాలు సాగర్ కే చంద్ర, సూర్య దేవర నాగవంశీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు కుమ్మర శాలివాహనులను అవమానపరిచిన పవన్ కల్యాణ్ కుమ్మర శాలివాహనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఆ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి: దర్శకుడు
‘‘అయ్యారే’కి డైరెక్షన్ చేస్తున్నప్పుడు సినిమా తీయాలనే తపన తప్ప నాకు ఇంకేం తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’కి పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఆ సినిమా ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ‘భీమ్లా నాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి’’ అని సాగర్ కె. చంద్ర అన్నారు. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సాగర్ కె.చంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌లాక్ డౌన్ సమయంలో నిర్మాత నాగవంశీగారు ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చూడమనడంతో చూశా. ఈ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నాం.. నీకు ఆసక్తి ఉందా? అనగానే ఓకే చెప్పాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారితో జర్నీ మొదలైంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్, రానాగార్లు రావడంతో మరింత ఎగై్జటింగ్‌గా ముందుకెళ్లాం. ఈ సినిమా వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో హ్యాపీ. ‘భీమ్లానాయక్’ని త్వరలో హిందీలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నా తర్వాతి సినిమా రీమేక్ కాకుండా స్ట్రైట్ మూవీ చేస్తా.‘భీమ్లానాయక్’ కి ముందు వరుణ్ తేజ్‌తో 14రీల్స్ ప్లస్ బ్యానర్లో ఓ సినిమా ప్రక టించారు. బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అవడంతో ఆగింది.. ఆ కథతోనే సినిమా చేస్తానా? కొత్త కథతోనా? చూడాలి’’ అన్నారు. -
భీమ్లా నాయక్ నుంచి నాలుగో పాట.. 'అడవి తల్లి మాట'
Bheemla Nayak Movie 4th Song "Adavi Thalli Mata" Released: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు, గ్లింప్స్ అదరగొడుతున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగా తాజాగా 'భీమ్లా నాయక్' ఫోర్త్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఫోర్త్ సింగిల్ అయిన 'అడవి తల్లి మాట' పాటను డిసెంబర్ 1న విడుదల చేయాల్సింది. అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట రిలీజ్‌ను ఆపేసారు. చివరికీ ఇవాళ (డిసెంబర్ 4, శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టే ఇవాళ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ 'అడవి తల్లి మాట' పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. దుర్గవ్వ, సాహితి చాగంటి తమదైన గాత్రంతో పాడి ఆకట్టుకున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' తెరకెక్కుతోంది. -
సంక్రాంతికి భీమ్లానాయక్ రిపోర్ట్, స్పెషల్ వీడియోతో సర్ప్రైజ్
BheemlaNayak: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన అందిస్తుడటం విశేషం. తాజాగా చిత్రయూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సంక్రాంతి బరిలోకి పవన్, రానా మూవీ వస్తోందని వెల్లడించింది. ఈ మేరకు మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్.. క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా మల్టీస్టారర్ మూవీ కూడా సంక్రాంతి విడుదలకు సై అనడంతో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్లో ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి! Power Star as #BheemlaNayak, will take charge Sankranthi 2022 🔥 Here's a small glimpse from the sets of #ProductionNo12 💫 ▶️ https://t.co/grU9Cd9acz Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli — Sithara Entertainments (@SitharaEnts) July 27, 2021 -
#pspkrana షూటింగ్ సెట్.. ఫొటో లీక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిలతో ఓ మల్టీస్టారర్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బ్రిక్స్ ప్లేస్‌లో #pspskrana అనే వర్కింగ్ టైటిల్‌తో ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది. అయితే అభిమానుల్లో అసక్తిని పెంచేందుకు చిత్ర నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కానీ ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయినప్పటికీ తాజాగా #pspkrana షూటింగ్ సెట్స్ నుంచి పవన్ ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన పవన్ అభిమానులు మురిసిపోతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ గొడపై నుంచి దూకుతున్నట్లు కనిపించాడు. అక్కడే ఆయన వెనక ఇద్దరు పోలీసులు కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు. కాగా ఇటీవల ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న పవన్ ఈ మూవీతో పాటు క్రిష్ జాగర్లముడి డైరెక్షన్లో #pspk27 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ‘వకీల్ సాబ్’ త్వరలో విడుదల కానుంది. బోని కపూర్, దిల్‌రాజుల సంయుక్తంగా నిర్మించి ఈ చిత్రంలో శృతీ హాసన్, నివేదిత థామస్ కథానాయికలు. ఇక రానా వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’లో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: రానా మరో జర్నీ బిగిన్స్ : కిల్లర్ కాంబో పవన్‌కు త్రివిక్రమ్ మాట సాయం -
పవన్‌తో పోరాటం.. రంగంలోకి రానా!
మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని తెలుగులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న విషయం తెలసిందే. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న విషయం విదితమే. ప్రొడక్షన్ నెం.12గా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. చదవండి: పవన్ కల్యాణ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలను ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. కాగా నేటి నుంచి పవన్‌తో కలసి రానా షూటింగ్లో పాల్గొననున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పదిరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరపనున్నారు. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్, అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పై చిత్రయూనిట్ అంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు -
పవన్ కొత్త సినిమా నుంచి క్రేజీ అప్డేట్..
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా కనుమ సందర్భంగా పవన్ కల్యాణ్ మరో సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. పవన్, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మాళయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని దర్శకుడు సాగర్ కే చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ స్ర్కీప్ట్ కూడా పూర్తి కావడంతో ఇక సెట్స్‌పైకి తీసుకేళ్లేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడంట. దీంతో ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లేతో పాటు మాటలు అందిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. (చదవండి: పవన్ సినిమాతో ఫుల్ బిజీ అయిపోయిన క్రిష్) ఇప్పటికే త్రివిక్రమ్, పవన్ ‘తీన్మార్’ చిత్రానికి మాటలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్, రానా మల్టిస్టారర్ సినిమాకు కూడా మాటలతో పాటు స్ర్కీన్ ప్లే అందించనున్నారు. దీనితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘శాకుంతలం’ అల్లు అరవింద్ తెరకెక్కించనున్న ‘రామాయాణం’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాయడం పూర్తెయింది. అయితే ఈ మాటల మాంత్రికుడు దర్శకుడిగానే కాకుండా.. మరోసారి మాటల రచయితగా తన కలానికి పని చెబుతున్నాడు. ఇక ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈ మల్టి స్టారర్ చిత్రానికి పవన్ 40 రోజుల కాల్షీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీలో బిజూ మీనన్, పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటించారు. బిజు మీనన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. (చదవండి: కేక పుట్టిస్తోన్న ‘వకీల్ సాబ్’ టీజర్.. ఆ డైలాగ్‌లో..) -
సూపర్ పోలీస్
కెరీర్లో తొలిసారి ఖాకీ వేసి సూపర్ పోలీస్‌గా మారనున్నారట వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరె„ý న్లో ఓ సినిమా చేస్తున్నారు. అది బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న కథ. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిటయ్యారు వరుణ్. ఇందులో తనది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ‘అయ్యారే, అప్పట్లో ఒకడు ఉండేవాడు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు సాగర్ చంద్ర. వరుణ్ తేజ్ బాక్సింగ్ సినిమా పూర్తయిన వెంటనే సాగర్ చంద్ర సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక వరుణ్ చేస్తున్న తాజా బాక్సింగ్ చిత్రం విషయానికి వస్తే ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. -
రానా, రవితేజలను డైరెక్ట్ చేయబోయేది అతడే?
మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మలయాళం చిత్రం తెలుగు రీమేక్‌పై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానా, రవితేజలు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తొలుత హరీశ్ శంకర్, సుధీర్ వర్మ వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారట. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..) ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు’ వంటి సెన్సిబుల్ చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్రతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ తెలుగు రీమేక్ చిత్రానికి ఈ యువ దర్శకుడే ఫిక్సయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రానా, రవితేజ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళంలో సాచీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ పోటాపోటీగా నటించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం దక్కించుకున్న సంగతి తెలిసిందే. (మరి మీరు ఎటువైపు?: నాని) -
మరో సినిమాను లైన్లో పెట్టిన రామ్
టాలెంట్ ఉన్నా వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో రామ్. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్న రామ్, తదుపరి చిత్రాన్ని కూడా లైన్ పెట్టాడు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అయ్యారే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సాగర్ కె చంద్ర తరువాత నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో తెరకెక్కిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సాగర్ ప్రస్తుతం రామ్ కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే రామ్ కు లైన్ వినిపించిన సాగర్, ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుకున్న సమయానికి కథ రెడీ అయితే ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ చేయబోయే సినిమా ఇదే అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను రామ్ తన సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీ బ్యానర్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. -
యువ డైరెక్టర్‌తో మెగాహీరో క్రేజీ ప్రాజెక్టు!
వరుస విజయాలతో ఊపుమీదున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఆయన హీరోగా తెరకెక్కిన ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ అద్భుతమైన విజయాలు సాధించాయి. భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ క్రమంలో వరుణ్ తేజ్ నెక్ట్స్ ఈ సినిమా ఏమిటన్నది ఆసక్తి నెలకొంది. అయితే, వరుణ్ మరోసారి ఒక యువ దర్శకుడికే అవకాశమిచ్చారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘తొలిప్రేమ’ వంటి మంచి హిట్ అందుకున్న వరుణ్.. ఇప్పుడు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సాగర్ చంద్రకు తన నెక్ట్స్ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుందని, ఈ సినిమాను 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మించబోతున్నారని వరుణ్ ట్విట్టర్లో తెలిపారు. ఉగాది పర్వదినాన ఈ శుభవార్త అభిమానులతో పంచుకుంటున్నట్టు తెలిపారు. నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో యువ దర్శకుడు సాగర్ చంద్ర మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విభిన్నమైన కథతో ప్రేక్షకుల మెప్పు పొందిన నేపథ్యంలో మెగాహీరో వరుణ్ నుంచి ఆయనకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. Good news on a good day! pic.twitter.com/pS5ggxd1bz — Varun Tej (@IAmVarunTej) 18 March 2018