మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మలయాళం చిత్రం తెలుగు రీమేక్‌పై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానా, రవితేజలు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తొలుత హరీశ్ శంకర్, సుధీర్ వర్మ వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారట. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..)
‘అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు’ వంటి సెన్సిబుల్ చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్రతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ తెలుగు రీమేక్ చిత్రానికి ఈ యువ దర్శకుడే ఫిక్సయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రానా, రవితేజ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళంలో సాచీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ పోటాపోటీగా నటించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం దక్కించుకున్న సంగతి తెలిసిందే. (మరి మీరు ఎటువైపు?: నాని)
రానా, రవితేజలను డైరెక్ట్ చేయబోయేది సాగర్ చంద్ర?
Published Fri, Jun 26 2020 6:14 PM | Last Updated on Fri, Jun 26 2020 6:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment