Case Filed On Bheemla Nayak Pawan Kalyan And Rana Daggubati Fight Scene In Guntur - Sakshi
Sakshi News home page

Bheemla Nayak Movie:‘భీమ్లా నాయక్‌’పై ఫిర్యాదు.. ఆ సీన్‌ తొలగించాలని డిమాండ్‌

Published Tue, Mar 1 2022 1:34 PM | Last Updated on Tue, Mar 1 2022 2:46 PM

Case Files On Pawan Kalyan, Rana Bheemla Nayak Movie In Guntur - Sakshi

పవన్‌ కల్యాణ్‌-రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌ చిత్రం భీమ్లా నాయక్‌ వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలోని పలు సన్నివేశాలపై కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డాక్టర్‌ మానేపల్లి వీవీఎస్‌ఎన్‌ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సన్నివేశాలని తొలిగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  ఈ మేరకు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వివరాల్లొకి వెళితే.. భీమ్లా నాయక్‌ మూవీలో రానా-పవన్‌ కల్యాణ్‌ల మధ్య చిత్రీకరించిన ఫైటింగ్‌ సీన్‌లో ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను రానా కాలితో తన్నారు. ఇది  తమ వర్గాన్ని అవమానించేలా ఉందని మానేపల్లి వీవీఎస్‌ఎన్‌ మూర్తి మీడియాకు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఫైటింగ్‌ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని(సారె) కాలితో తన్ని దానితో పవన్‌పై దాడి చేసినట్లు చూపించారు. మేము  కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటి సారెను కాలితో తన్నినట్లు చూపించడం మమ్మల్ని కించపరచడమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది’ అని ఆయన అన్నారు. అంతేకాదు ఈ సన్నివేశాన్ని వెంటనే  మూవీ నుంచి తొలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సినిమా హీరోలు పవన్‌ కల్యాణ్‌, రానా, దర్శక-నిర్మాలు సాగర్‌ కే చంద్ర, సూర్య దేవర నాగవంశీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు కుమ్మర శాలివాహనులను అవమానపరిచిన పవన్‌ కల్యాణ్‌ కుమ్మర శాలివాహనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement