Disney Plus Hotstar and Aha Announced Bheemla Nayak Streaming on March 24th - Sakshi
Sakshi News home page

Bheemla Nayak-OTT: ఒక్కరోజు ముందుగానే స్ట్రీమింగ్‌ కానున్న ‘భీమ్లా నాయక్‌’

Published Wed, Mar 23 2022 6:37 PM | Last Updated on Wed, Mar 23 2022 6:58 PM

OTT: AHA Announced Bheemla Nayak Streaming On March 24th - Sakshi

పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భీమ్లా నాయక్‌'. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్‌ సరిగ్గా నెల రోజులకు ఓటీటీ సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. మార్చి 25న ఈ మూవీ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

చదవండి: షాకింగ్‌: నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌పై కేసు

ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై తాజా అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పుడు భీమ్లా నాయక్‌ను ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కాబోతోన్న నేపథ్యంలో మార్చి 24న భీమ్లా నాయక్‌ను స్ట్రీమింగ్ చేయనున్నామంటూ ఆహా వెల్లడించింది. అలాగే హాట్‌స్టార్‌ కూడా మార్చి 24న స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జోడీగా సంయుక్తా మీనన్‌ నటించిన సంగతి తెలిసిందే.

చదవండి: భార్యతో స్టార్‌ హీరో రొమాంటిక్‌ డేట్‌, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement