ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'లగ్గం టైమ్'.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది! | Tollywood Movie Laggam Time First Look Poster Released | Sakshi
Sakshi News home page

Laggam Time Movie: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'లగ్గం టైమ్'.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?

Published Wed, Nov 6 2024 7:01 PM | Last Updated on Wed, Nov 6 2024 7:04 PM

Tollywood Movie Laggam Time First Look Poster Released

రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తోన్న చిత్రం లగ్గం టైమ్. ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. 20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై కె.హిమ బిందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర చేతుల మీదుగా పోస్టర్‌ను విడుదల చేశారు.

పోస్టర్ చూస్తుంటే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు. ప్రేమ, వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని మేకర్స్ అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.  

కాగా.. ఈ చిత్రంలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే లగ్గంటైమ్‌కు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement