సూపర్‌ పోలీస్‌ | Varun Tej teams up with Sagar Chandra for his next | Sakshi
Sakshi News home page

సూపర్‌ పోలీస్‌

Published Sat, Aug 29 2020 1:14 AM | Last Updated on Sat, Aug 29 2020 1:14 AM

Varun Tej teams up with Sagar Chandra for his next - Sakshi

కెరీర్‌లో తొలిసారి ఖాకీ వేసి సూపర్‌ పోలీస్‌గా మారనున్నారట వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి డైరె„ý న్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అది బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న కథ. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత సాగర్‌ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిటయ్యారు వరుణ్‌. ఇందులో తనది పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర అని సమాచారం.

‘అయ్యారే, అప్పట్లో ఒకడు ఉండేవాడు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు సాగర్‌ చంద్ర. వరుణ్‌ తేజ్‌ బాక్సింగ్‌ సినిమా పూర్తయిన వెంటనే సాగర్‌ చంద్ర సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇక వరుణ్‌ చేస్తున్న తాజా బాక్సింగ్‌ చిత్రం విషయానికి వస్తే ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. అల్లు అరవింద్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement