Modern Love Hyderabad Web Series: Amazon Prime Announces Release Date - Sakshi
Sakshi News home page

Modern Love Hyderabad OTT Release: అ‍ప్పటినుంచే 'మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌'..

Published Wed, Jun 22 2022 4:18 PM | Last Updated on Wed, Jun 22 2022 4:58 PM

Modern Love Hyderabad: Amazon Prime Announces Release Date - Sakshi

Modern Love Hyderabad: Amazon Prime Announces Release Date: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. సొంతగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల నిర్మిస్తూ యంగ్‌ అండ్‌ న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో చిన్న హీరోలు, నటీనటులంతా ఓటీటీ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకునే వాటిలో ఒకటి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో. అమెజాన్‌ ప్రైమ్ ఒరిజినల్స్ పేరుతో అనేక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తూ అలరిస్తోంది. తాజాగా 'మోడ్రన్‌ లవ్ హైదరాబాద్' అనే వెబ్‌ సిరీస్ రానుంది. 

ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్, రీతూ వర్మ, హీరో ఆది పినిశెట్టి, బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌తోపాటు సీనియర్ నటి సుహాసిని, కోమలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 6 ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్‌ సిరీస్‌కు నలుగురు డైరెక్టర్లు నగేష్‌, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా నెల క్రితం అమెజాన్‌ సంస్థ 'మోడ్రన్‌ లవ్‌ ముంబై' పేరుతో సిరీస్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఏప్రిల్‌ 28న 'మోడ్రన్ లవ్‌ చెన్నై' కూడా రిలీజ్ కాగా ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. 

చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement