Suhasini Maniratnam
-
షూటింగ్ పూర్తి కాగానే అక్కడ జరిగేది ఇదే.. లైంగిక వేధింపులపై సుహాసిని
మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసిన తర్వాత చాలామంది సీనియర్ హీరోయిన్లు నిజమేనంటూ తమ అభిప్రాయం చెప్పారు. అయితే, తాజాగా నటి సుహాసిని ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సినిమాలో మహిళలకు రక్షణ అనే అంశంపై చర్చావేదికను నిర్వహించారు. అందులో పలు భాషలకు చెందిన నటీమణులు, దర్శకులు పాల్గొన్నారు. అందులో పాల్గొన్న నటి సుహాసిని మాట్లాడుతూ సినిమా రంగం ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని పేర్కొన్నారు. ఇతర రంగాలలో పని చేసే వారు పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతారన్నారు. అయితే సినిమాలో అలా కాదన్నారు. 200 నుంచి 300 మంది షూటింగ్ కోసం ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడే ఒక కుటుంబంలా కలిసుండాలన్నారు. అక్కడ విధి, విధానాలను పాటించకపోతే హద్దులు మీరే అవకాశం ఉంటుందన్నారు. 200 మంది ఓ చిత్ర యూనిట్లో తమ కుటుంబాలకు దూరంగా ఉండే వారిపై కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు సినిమా రంగంలోని వస్తున్న వారికి సరైన అనుభవం ఉండటం లేదన్నారు. దీన్ని కొందరు తప్పుగా వాడుకోవాలను చూస్తారన్నారు. అదేవిధంగా ఇతర చిత్ర పరిశ్రమల మాదిరి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు రక్షణ తక్కువన్నారు. మలమాళ చిత్రాల షూటింగ్‌లు అధికంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతుంటాయని చెప్పారు. దీంతో నటీమణులు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. దీంతో వారిపై తప్పుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువన్నారు. ఇదే మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతోందని చెప్పారు. తమిళ చిత్ర షూటింగ్ పూర్తి అయితే తాను చైన్నెకి తిరిగి వెళ్లిపోతానని, తెలుగు షూటింగ్ అయితే హైదరాబాద్‌కు, కర్ణాటకలో షూటింగ్ అయితే బెంగళూర్‌కు వెళ్లిపోతానన్నారు. అయితే మలయాళం సినిమాల షూటింగ్ పూర్తి అయితే మీరు ఇంటికి తిరిగి వెళ్లలేరని, కారణం అక్కడ అలాంటి వాతావరణం లేకపోవడమేనని అన్నారు. అంతేకాకుడా మీకు బయటకు కూడా వెళ్లడం కుదరదన్నారు. అందుకే షూటింగ్ ప్రాంతాల్లో హద్దులు మీరుతున్నాయనే అభిప్రాయాన్ని నటి సుహాసిని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
Suhasini Maniratnam: మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన హీరోయిన్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
'మిణుగురులు' చిత్రానికి పదేళ్లు.. అమెరికాలో స్పెషల్ షో
అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014లో తెరకెక్కిన చిత్రం 'మిణుగురులు'. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్, దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో తాజాగా స్పెషల్ షో వేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు - నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, దర్శకుడు శేఖర్ కమ్ముల, పాటల రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ చిత్రంలోని సామాజిక అంశాలని, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, "2014లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్లేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది. సరిగ్గా వారం కూడా ఆడని చిత్రాల మధ్య 'మిణుగురులు' 10 ఏళ్లు నిలిచింది అని ఈ కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రేక్షకుడు అన్నారు. ‘మిణుగురులు’ 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'గోల్డెన్ ఎలిఫెంట్' గెలుచుకుంది. ఇండియా అంతర్జాతీయ డిసెబిలిటీ ఫిలిం ఫెస్టివల్,ఇతర ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపికైంది. 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'ఉత్తమ చిత్రం' అవార్డు గెలుచుకుంది. 2014 లో 'అస్కార్స్' కి ఉత్తమ చిత్ర జాబితాలో ఎంపికయిన చిత్రాల్లో 'మిణుగురులు' కూడా ఉంది. ఆస్కార్ గ్రంథాల్లో శాశ్వత చిత్రాల జాబితాలో 'మిణుగురులు' కథ కూడా ఉంటుంది. అని ఆయన చెప్పారు. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుడు. పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్లోని నార్త్ వెస్ట్ ఫిలిం సెంటర్లో ఫిలిం మేకింగ్ నేర్చుకున్న ఈయన అమెరికా టివి ఛానల్ ఓపిబిలో కొన్నేళ్లు పనిచేశారు. తన దర్శక నిర్మాణంలో తీసిన పలు షార్ట్ ఫిలిమ్స్, డాక్యూమెంటరీలు చాల అవార్డులు గెలుచుకున్నాయి. ఆయన 'మిణుగురులు' చిత్రం 2014 లో 7 నంది అవార్డులు గెలుచుకుంది. నేటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉండే రొమాంటిక్ ప్రేమ కథతో '24 కిస్సెస్' అనే చిత్రాన్ని తీశారు. ఆయన తదుపరి కథల వరుసలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వనున్న గ్లోబల్, ఓటిటిలో చిత్రాలు ఉండడం విశేషం. -
Mani Ratnam: డైరెక్టర్ ‘మణిరత్నం’ అరుదైన చిత్రాలు
-
Mister Pregnant Trailer Launch Event: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ లాంచ్.. ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున (ఫొటోలు)
-
శరత్‌బాబుకు తమిళ సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
'నిన్నే చూస్తు' మూవీ రివ్యూ
టైటిల్ : నిన్నే చూస్తు దర్శకుడు: కె. గోవర్ధనరావు నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలత రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే, భానుచందర్, కిన్నెర, జబర్దస్త్ మహేష్ తదితరులు బ్యానర్ : వీరభద్ర క్రియేషన్స్ ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి సంగీతం: రమణ్ రాతోడ్ ఎడిటర్ : నాగిరెడ్డి కెమెరా : ఈదర ప్రసాద్ విడుదల తేదీ: అక్టోబర్ 27, 2022 శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం నిన్నే చూస్తు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.. కథ అమలాపురంలో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్‌ను హత్య చేసిన వారిని చంపాలని రగిలిపోతుంటాడు. బ్యాగ్‌లో గన్ పెట్టుకొని తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెదుకుతూ ఉంటాడు. చివరకు తన తండ్రిని చంపిన వ్యక్తి వైజాగ్‌లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర)ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. తన ఫ్రెండ్ స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య. ఈ క్రమంలో హీరోహీరోయిన్లిద్దరూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమను కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య. దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణకు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటాడు. అతడి మీద కోపంతో సత్యతో నువ్వంటే ఇష్టం లేదు "ఐ హేట్ యు" అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకుతో సత్యకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అసలు జగదీశ్ చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్‌ను ఎందుకు చంపాడు? జగదీశ్‌ను కృష్ణ చంపాడా లేదా? సత్య కృష్ణను పెళ్లాడిందా? లేక తన బావను పెళ్లి చేసుకుందా? అన్న విషయాలు తెలియాలంటే "నిన్నే చూస్తు".. సినిమా చూడాల్సిందే! నటీనటుల పనితీరు అమ్మను ప్రేమగా చూసుకొనే కొడుకుగా, సత్యను ప్రేమించే లవర్‌గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కొడుకుగా పలు షేడ్స్ వున్న పాత్రలో శ్రీకాంత్ చక్కగా నటించాడు. ఒక వైపు నిర్మాతగా మరోవైపు హీరోయిన్గా బుజ్జి(హేమలతా రెడ్డి) ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్ తల్లిదండ్రులు, హీరో ఫ్రెండ్స్ వారి పాత్రలకు తగ్గట్లు నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనను దర్శకుడు కె గోవర్ధనరావు అద్భుతంగా తెరకెక్కించాడు. రమణ్ రాథోడ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్ అందించిన విజువల్స్ పర్వాలేదు. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఇంకాస్త ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. చదవండి: అప్పుడే సమంతతో లవ్‌లో పడ్డా: విజయ్ దేవరకొండ బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? -
'బలమెవ్వడు' మూవీ రివ్యూ
టైటిల్ : బలమెవ్వడు నటీ నటులు : ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృద్వి రాజ్, నాజర్, సుహాసిని మణి రత్నంతదితరులు బ్యానర్ : సనాతన దృశ్యాలు నిర్మాత : ఆర్. బి. మార్కండేయలు కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : సత్య రాచకొండ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సంతోష్, గిరి విడుదల తేది : అక్టోబర్ 1, 2022 వైవిద్య భరితమైన కథాంశంతో వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నిస్తూ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా "బలమెవ్వడు". సనాతన దృశ్యాలు పతాకంపై ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా సత్య రాచకొండ దర్శకత్వంలో ఆర్ బి మార్కండేయులు ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటులు పృథ్వీరాజ్, సుహాసిని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "బలమెవ్వడు' చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం . బలమెవ్వడు కథ ఏంటంటే.. సత్యనారాయణ (ధృవన్ కటకం) ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంటాడు. ఈ క్రమంలో పాలసీ కట్టించడానికి వెళ్లిన సత్యకు అక్కడే డ్యాన్స్ చేస్తున్న క్లాసికల్ డ్యాన్సర్ పరిణిక (నియా త్రిపాఠీ)ను చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ తరువాత ఓ ఘటనలో ఆకతాయిల నుంచి పరిణికని సత్య కాపాడుతాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురిస్తుంది. ఓ సారి పరిణికకు హెల్త్ బాగా లేదని హాస్పిటల్‌కు వెళ్తే క్యాన్సర్ ఉన్న విషయం బయటకు వస్తుంది. కీమోథెరఫీ చెయ్యాలి అంటాడు డాక్టర్ ఫణిభూషణ్ ఉరఫ్ పి.బి(పృథ్విరాజ్).పరిణికను అక్కడిక్కడే పెళ్లి చేసుకుంటాడు సత్య. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎంతో పేరు గాంచిన పి.బీ.. మెడికల్ మాఫియాతో చేతులు కలపి బిజినెస్ చేస్తూ కోట్లు గడిస్తుంటాడు. అలాంటి పి. బి కి జీవితంలో ఊహించని షాక్ తగులుతుంది? పి.బి కి తగిలిన షాక్ ఏంటి? మెడికల్ మాఫియా ముసుగులో అందరినీ మోసం చేస్తూ బిజినెస్ చేస్తున్న పి. బీ కి "బలమెవ్వడు" ఆ బలాన్ని సత్య, యశోద ల బుద్ది బలంతో బలహీనునిగా చేసి అక్కడ జరిగే మెడికల్ మాఫియాకు ఎలాంటి గుణ పాఠం చెప్పారు ? అనేది ‘బలమెవ్వడు’ కథ. ఎవరెలా నటించారంటే.. సత్యనారాయణ (ధృవన్ కటకం) సాధారణమైన మధ్య తరగతి యువకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. హీరోయిన్ పరిణిక (నియా త్రిపాఠీ) చాలా చక్కగా నటించింది. అందంగా కనిపించింది. డాక్టర్ ఫణిభూషణ్ ఉరఫ్ పి.బి(పృథ్విరాజ్) నటన ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. వయసులో ఉన్న వ్యక్తి గా, అలాగే వయసు మళ్ళిన పాత్రలో ఇలా రెండు షేడ్స్ లలో చాలా బాగా నటించాడు. వైద్యో నారాయణ హరీ అన్న పదానికి నిజాయితీ గల డాక్టర్ గా యశోద పాత్రలో సుహాసిని గారు చక్కగా నటించారు. రాఖీ సినిమా తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ దక్కినట్టు అనిపించింది. హాస్పిటల్ ఓనర్‌గా నాజర్ పాత్ర చిన్నదే అయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో చాలా బాగా చేశారు. పృథ్వి భార్య పాత్రలో అంజలి (పద్మ) మెప్పించింది. మిగిలిన వారంతా కూడా తమ పరిధి మేరకు నటించారు. ఎలా ఉందంటే.. మెడికల్ మాఫియా వల్ల పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారు.. ఆరోగ్యం ఎలా చెడుతుంది అనేది చూపించారు. మెడికల్ మాఫియా ఆగడాలను ఎలా ఎదుర్కోవాలో అన్న పాయింట్‌తో చాలా ఇంట్రెస్ట్ కలిగించే అంశంతో టీం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకుని అందరికీ అర్థమయ్యేలా కథ, కథనాలను రాసుకొన్నారు. పైగా కమర్షియల్ అంశాల కోసం ఇందులో ప్రేమ కథను కూడా జోడించారు దర్శకుడు. సున్నితమైన హాస్యాన్ని కూడా జొప్పిస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. అంతర్లీనంగా సందేశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. కొత్త దర్శకుడే అయినా కూడా ప్రేక్షకులకు మాత్రం ఆ భావన కలగదు. ప్రతీ సీన్‌ను డీటైలింగ్‌గా తెరకెక్కించాడు. మెడికల్ మాఫియాలో కావడంతో కథ, కథనాలు కాస్త జనాలకు కొత్తగా అనిపిస్తుంది. పాయింట్ కొత్తగా అనిపించినా కథనంలో మాత్రం పాత పద్దతే ఫాలో అయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ జరుగుతున్న ఈ కథ కొరకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడి తీసినట్టు కనిపిస్తుంది. అయితే లవ్ సీన్స్ మరీ రొటీన్‌గా అనిపిస్తాయి. ప్రథమార్థంలో అసలు కథ మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో కథనం పరిగెట్టినట్టు అనిపిస్తుంది. అయితే అక్కడక్కడా కథనం కాస్త నీరసంగా అనిపిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచేలా ఉంది. మాటలు అక్కడక్కడా బాగానే పేలినట్టు అనిపిస్తాయి. సంతోష్, గిరి సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. జస్విన్ ప్రభు ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
అమెజాన్ ప్రైమ్ కొత్త సిరీస్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..
Modern Love Hyderabad: Amazon Prime Announces Release Date: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. సొంతగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మిస్తూ యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో చిన్న హీరోలు, నటీనటులంతా ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకునే వాటిలో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ పేరుతో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ అలరిస్తోంది. తాజాగా 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ రానుంది. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్, రీతూ వర్మ, హీరో ఆది పినిశెట్టి, బిగ్‌బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్‌తోపాటు సీనియర్ నటి సుహాసిని, కోమలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 6 ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌కు నలుగురు డైరెక్టర్లు నగేష్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా నెల క్రితం అమెజాన్ సంస్థ 'మోడ్రన్ లవ్ ముంబై' పేరుతో సిరీస్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఏప్రిల్ 28న 'మోడ్రన్ లవ్ చెన్నై' కూడా రిలీజ్ కాగా ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ bringing you 6 heartfelt stories of love all the way from Hyderabad 😍#ModernLoveOnPrime, July 8 #SICProductions @nareshagastya @hasinimani @komaleeprasad @MenenNithya #RevathyAshaKelunni #UlkaGupta #NareshVijayaKrishna @Abijeet #MalavikaNair @AadhiOfficial @riturv pic.twitter.com/lK7OdTzOv6 — amazon prime video IN (@PrimeVideoIN) June 22, 2022 -
హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Suhasini Respond On Hindi Language War: ప్రస్తుతం సినీ పరిశ్రమంలో హిందీ భాష వివాదం హాట్‌టాపిక్‌గా నిలిచింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య ట్విటర్ వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్‌పై సౌత్, నార్త్ సినీ సెలెబ్రెటీలు స్పందిస్తు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సుహాసిని హిందీ భాష వివాదంపై స్పందించారు. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్ నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ భాష చాలా బాగుంటుందని, అది కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు. హిందీ వాళ్లు మంచి వాళ్లని, వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలని చెప్పారు. అలాగే తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లేనని, హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని సుహాసిని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, మరికొంతమంది హిందీ మాట్లాడతారన్నారు. చదవండి: లెటెస్ట్ అప్డేట్: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఆ తర్వాత ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే మనకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. దీంతో సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్లోనే ఉండాల్సిందంటూ సుహాసినిపై సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుహాసిని ‘ఫోకస్’ ఫస్ట్‌లుక్
విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలలో జి. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫోకస్’. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథ-కథనాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, వేలంటైన్స్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫోకస్ మూవీ నుంచి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ పోస్టర్‌ను సినీ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యతేజ తన డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై `ఫోకస్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌శంకర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడే టీజర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్రలు చాలా ఉన్నాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. ‘నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం `ఫోకస్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్‌ను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. భాను చందర్, షియాజీ షిండే, జీవా, సూర్య భగవాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
చిరు ఇంట్లో పీవీ సింధుకు సత్కారం, టాలీవుడ్ ప్రముఖుల హాజరు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, రానా, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ పలువురు హీరోలతో పాటు హీరోయిన్లు సుహాసిని, రాధిక శరత్ కుమార్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ ప్రముఖుల మధ్య మెగాస్టార్, అల్లు అరవింద్ తదితరులు సింధును సత్కరించి అనంతరం ఆమె సాధించిన మెడల్‌తో వారంతా ఫొటోలు దిగారు. చదవండి: ప్రభాస్ అస్సలు అలాంటి వాడు కాదు: కృతి సనన్ ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేస్తూ.. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ ఆఫీసులో బిగ్‌బాస్ సభ్యులకు నైట్ పార్టీ! View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
'బలమెవ్వడు'లో పవర్ఫుల్ పాత్రలో సుహాసినీ
దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసినీ. తెలుగు ప్రేక్షకులకు సుహసినీ అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు సుహసినీ. గతంలో 'రాఖీ' చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈసారి మరో పవర్ ఫుల్ పాత్ర ద్వారా మన ముందుకు రాబోతున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ జీవించనున్నట్లు తెలుస్తోంది. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని చిత్రయూనిట్ పేర్కొంది. -
తీన్మార్ స్టెప్పులేసిన కమల్ కూతురు, సుహాసిని
-
గొప్పగా నటించమని వేడుకుంటా: మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మొదటిసారిగా సోషల్ మీడియా లైవ్‌చాట్‌లోకి వచ్చారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఆసక్తి కనబరచని ఆయన తన భార్య, నటి సుహాసిని నిర్వహించిన లైవ్‌చాట్‌లో మొదటిసారిగా పాల్గొన్నారు. అంతేగాక సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండే ఆయన ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ లైవ్‌లో హీరో మాధవన్, నటి ఖుష్భు, అదితిరావ్ హైదరిలతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘మాధవన్ నువ్వు మణిరత్నం(ఆయన)కు గోల్ఫ్ ఆటను పరిచయం చేయడం ద్వారా ఆయన జీవితం మారిపోయింది’ అని సుహాసిని అన్నారు. అయితే ‘ఆటలో నన్ను ఓడించమని రత్నం సార్‌కు సవాలు విసిరాను.. కానీ ఆయన నాపై చెత్తను విసిరారు’ అంటూ చమత్కరించాడు. (నిర్మాతను టెన్షన్ పెడుతున్న హీరోయిన్) అంతేగాక మణిరత్నం నిర్మించిన మాధవన్ ‘అలైపాయుతే’ సినిమాలోని ఓ రైలు సన్నివేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ.. ‘సన్నివేశం చిత్రీకరించడానికి ఆ సమయంలో రెండు రైళ్లు ఉన్నప్పటికీ.. నాకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్రీకరణపై ఆందోళన చెందాను’ అని చెప్పుకొచ్చారు. ఇక మధ్యలో నటి అను హాసన్ కలుగజేసుకుని మణిరత్నంపై రాపిడ్‌ఫైర్ ప్రశ్నలను సందించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లో ఉన్న మీరు భార్య నుంచి ఎలా తప్పించుకుంటున్నారని అడగ్గా.. ‘లాక్డౌన్లో నేను నిశ్శబ్ధాన్ని పాటించడం నేర్చుకున్న’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రముఖ నటి పూనం ధిల్లాన్... ‘పాత్రల ఎంపికలో ఏలా ఉంటారు. అసాధారణమైన నటులను ఎన్నుకుంటారా లేక సాధారణ నటులను అసాధారణమైన వారిగా మార్చుకుంటారా’ అని అడిగారు. ‘నా నటీనటులను బాగా నటించమని వేడుకుంటాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్) View this post on Instagram Good evening. Hope u enjoyed the live sessions last 21 days. It was time to say good bye. But we had an amazing evening. Hope you all liked what was planned and what was spontaneous. Give us your feed. Especially those whose videos were played A post shared by Suhasini Hasan (@suhasinihasan) on Apr 14, 2020 at 9:08am PDT ఇక అదితి రావు హైదరి.. పాత్రలకు సరైన నటులను ఎలా అడగ్గా.. తనని కాస్తా ఇబ్బందికి గురి చేసే నటుల కోసమే నేను ఎప్పుడూ వెతుకుతానని చెప్పాడు. “ఇది కూడా ఓ మంచి అనుభూతి. ఎవరైనా మొదటి ఎంపికతోనే ఎల్లప్పుడూ ముగించ కూడదు. నిజానికి సరైనా ఎంపిక.. మనం చేసే సగం పనిని పూర్తి చేస్తుంది. అయితే నేను ఏది చెబితే అది మాత్రమే చేసే వారిని వెతకను. దానితో పాటు అదనంగా ఎదైన కొత్తగా చేయాలి’’ అని చెప్పారు. ఇక ఓటీటీ(ఓవర్ దీ టాప్) వంటి ప్లాట్‌ఫాంల కోసం సినిమా చేయడానికి లేదా చూపించడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని అభిమానులు అడిగిన ప్రశ్నకు.. “నేను 20 సంవత్సరాలుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పు నన్ను మీరు ఫుట్‌బాల్ ఆడమని అడిగితే ఆడలేను. అంతేగాక ఆ ఆటకు న్యాయం కూడా చేయలేను ” అంటు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాగా ప్రముఖ తమిళ ఇతిహాస నవల ఆధారంగా ఆయన తెరకెక్కించబోయే ‘పొన్నీన్ సెల్వన్’ను సీరిస్‌లుగా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సినిమాల్లో మీరు ఎప్పుడైనా నటించాలనుకుంటున్నారా అని ఓ అభిమాని అడిగ్గా... ఇదే ప్రశ్నను ఇది వరకే రజనీకాంత్ కుమార్తె ఆయనను అడిగినట్లు సుహాసిని చెప్పారు. దానికి ఆయన చేయనని వెంటనే సమాధానం ఇచ్చారని కూడా ఆమె తెలిపారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం) -
పవన్ పాటకు నిహారిక, సుహాసిని స్టెప్పులు
మెగా హీరోయిన్ నిహారిక, రాహుల్ విజయ్‌లు నటించిన ‘సూర్యకాంతం’ చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా సూర్యకాంతం షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని.. చిత్ర బృందం ప్రమోషన్లో భాగంగా వాడుకుంది. నిహారిక తన బాబాయి.. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు. అంతేకాకుండా సుహాసిని చేత కూడా డ్యాన్స్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్వాణ సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్‌సిరీస్ ఫేమ్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాజీరాజా, సుహాసినిలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వరుణ్ తేజ్, నిర్మాతలు: సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోల్, రామ్ నరేశ్. సాహిత్యం: కృష్ణకాంత్. #Suryakantam dancing for @PawanKalyan garu song. Some behind the scenes fun, while shooting the movie. #SuryakantamOnMarch29#PawanKalyan @IAmVarunTej @IamPranithB @IamNiharikaK #SuhasiniManiratnam @ActorRahulVijay #PerleneBhesania @NirvanaCinemas @markkrobin @LahariMusic pic.twitter.com/bVsU74xPkF — Nirvana Cinemas (@NirvanaCinemas) March 9, 2019 -
కేణిలో ఆ ఇద్దరి పాట.. నిజంగా విశేషమే!
సాక్షి, చెన్నై: గానగంధర్వులు కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడితే అది నిజంగా విశేషమే అవుతుంది. అలా 25 ఏళ్ల ముందు ఈ గాన తపస్విలు కలిసి ఆలపించారు. ఆ తరువాత సంగీత కచేరిలో ఒకే వేదికపై పాడి ఉండవచ్చుగానీ, సినిమా కోసం కలిసి పాడిన సందర్భం లేదు. అలాంటి అరుదైన సంఘటన కేణి చిత్రం కోసం జరిగింది. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒకే పాటను కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలు కలిసి పాడారు. మలయాళ దర్శకుడు నిషాద్ తొలిసారిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఇందులో సీనియర్ నటి జయప్రద, సుహాసిని, రేవతి, నటుడు పార్థిబన్, నాజర్, నటి అనుహాసన్, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రగ్రాంట్ నేచర్ ఫిలిం క్రియేషన్స్ పతాకంపై ఆన్ సజీవ్, సజీవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్రహోటల్‌లో జరిగింది. నటి సుహాసిని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా నటి జయప్రద, పార్థిబన్ తొలి ప్రతిని అందుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. తమిళంలో వరసగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకు ముందు నినైత్తాలే ఇనిక్కుమ్, సలంగై ఒళి, ఏళైజాతి, దశావతారం వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు కేణి వంటి మంచి చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను ఇందిర అనే సామాజిక బాధ్యత కలిగిని పాత్రలో నటించానని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందాలని అందరం చెబుతుంటామన్నారు. అయితే అలాంటి సమాజాన్ని స్త్రీలే సాధించుకోవాలని చెప్పే చిత్రంగా కేణి చిత్రం ఉంటుందని తెలిపారు. అదే విధంగా మంచి నీళ్లు అన్నవి తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు సంబంధించిన విషయం కాదన్నారు. నీరు అన్నది ప్రపంచ సమస్య అని, అలాంటి సమస్యను కథలో చేర్చిన దర్శకుడిని అభినందిస్తున్నానన్నారు. తాను ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలోనూ నటించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. దర్శకుడు నిషాద్ మాట్లాడుతూ.. మలయాళంలో కిణరు తనకు ఏడవ చిత్రం అయినా, తమిళంలో కేణి తొలి చిత్రం అని తెలిపారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సామాజిక ఇతివృత్తంతో కూడి ఉంటుందన్నారు. నీళ్లు ఈ భూమిపై జీవించే ప్రాణులందరికి చెందుతాయన్నారు. అలాంటిది మానవులు మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఎండ, వాన లాంటివి ప్రకృతి ప్రసాదించినవని కరువుకు మాత్రం మనిషే కారణం అవుతున్నాడని అన్నారు. ఈ విషయాలను ఆవిష్కరించే చిత్రంగా కేణి ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
'అందరూ హాటే, అయితే ఆమె హాటెస్ట్'
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వయసు మీద పడుతున్నా ఇప్పటికీ యంగ్ లుక్‌తో యువహీరోలతో పోటీ పడుతున్నారు. నాగార్జున అందం, స్టైల్ చూసి ఇష్టపడిని భామలు ఎవరు ఉండరనడంలో సందేహం లేదు. మరి అలాంటి కింగ్ మనసును గెలుచుకుంది ఓ యువ హీరోయిన్. తన తోటీ నటీమణులను పక్కకు నెట్టి నాగ్‌తో హాట్ అనిపించుకుంది ఎవరంటే మిల్కీ బ్యూటీ తమన్న. ఓ ఛానల్ రియార్టీ షోలో నాగార్జున ఈ మాటలు చెప్పటం విశేషం. ఈ కార్యక్రమానికి నాగ్ ...అప్పటి హీరోయిన్ సుహాసినీ మణిరత్నంతో కలిసి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సుహాసినీ .... గ్రీకువీరుడిపై కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ తరం హీరోయిన్లు సమంత, కాజల్, శ్రుతి హాసన్, తమన్నాలలో ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడగగా, 'అందరూ హాటే, అయితే తమన్నా హాటెస్ట్'అని సమాధానం ఇచ్చారు. యుక్త వయసులో ఉన్నప్పుడు తాను జయసుధను ఆరాధించేవాడినని, ఎన్టీఆర్ క్లాసిక్ చిత్రం 'అడివి రాముడు'ని 20సార్లు చూసినట్లు నాగార్జున తెలిపారు. ఆ సినిమా తొలిసారి చూసినప్పుడు జయసుధ, జయప్రదల నటన తనకు గుర్తుండిపోయిందని నాగ్ వెల్లడించాడు. -
ఆయన ఇప్పుడు కనపడితే ర్యాగింగ్ చేస్తా!
‘‘నా కెరీర్లో నేను ఎక్కువగా చేసినవి తెలుగు సినిమాలే. దాదాపు రెండొందల యాభై పైచిలుకు సినిమాల్లో నేను చేసి ఉంటే... అందులో వందకు పైగా తెలుగు సినిమాలే ఉంటాయి. అందుకే... నేను తెలుగు హీరోయిన్ని. ఇది మీ ముందే కాదు, మా ఇంట్లో మా ఆయన ముందు, బాబాయ్ ముందు కూడా చెబుతా’ అన్నారు సుహాసిని. దీన్నిబట్టి తెలుగు సినిమాపై ఆమెకున్న మమకారం అర్థం చేసుకోవచ్చు. అటు గ్లామర్ తారగా మెరిపిస్తూ, ఇటు అభినయతారగా మురిపిస్తూ... తెలుగుతెరను ఓ దశాబ్దం పాటు ఏలారామె. తాజాగా ఎన్. మోహన్ దర్శకత్వంలో తానికొండ వెంకటేశ్వర్లు నిర్మించిన ‘సచిన్’ (టెండూల్కర్ కాదు) సినిమాలో ఓ కీలక భూమిక పోషించిన సుహాసిని ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలివి. మీ తరం కథానాయికలతో పోల్చి చూస్తే... మీరే ఎక్కువ గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. ఏమిటి మీ గ్లామర్ రహస్యం? శ్రీదేవిని చూసి కూడా మీరు ఈ ప్రశ్న ఎలా వేయగలిగారు? ఆమెతో పోలిస్తే నా అందం ఎంత! అసలు అందానికి వయసుతో పని లేదండీ. నా దృష్టిలో మోస్ట్ గ్లామరస్ లేడీ అంటే ఇందిరాగాంధీ. ఒక్కసారి ఆమెను చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టయిలంటే నాకు పిచ్చి. ఇక నా విషయానికొస్తే... చిన్నతనం నుంచి నాకు శరీరంపై శ్రద్ధ ఎక్కువ. ప్రతిరోజూ వ్యాయామాలు చేసేదాన్ని. ఓ విధంగా సినిమాల్లోకి వచ్చాకనే నాకు సోమరితనం పెరిగింది. పెళ్లై, బిడ్డ పుట్టాక మళ్లీ శరీరంపై శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాను. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తా. డాన్సింగ్ ఎక్సర్సైజులు చేస్తా. ఈ మధ్యే ఓ రష్యన్ బ్యాలే డాన్సర్‌ని కలిశాను. ప్రస్తుతం ఆమె నా పర్సనల్ ట్రైనర్. ఆమె ద్వారా భిన్నమైన వ్యాయామాలు నేర్చుకుంటున్నా. మంచుపల్లకి, ముక్కుపుడక, స్వాతి, స్రవంతి, అక్కమొగుడు, అమ్మ... ఇలా ఎన్నో భిన్నమైన పాత్రలు చేసిన మీకు... ఇప్పటి హీరోయిన్లను చూస్తే ఏమనిపిస్తుంది? అసూయగా ఉంటుంది. ఎందుకంటే... వీళ్లకున్న సౌకర్యాలు అప్పుడు మాకు లేవు. సినిమా సాంకేతికంగా ఎన్నో రెట్లు ఎదిగిపోయింది. మీడియా వల్ల ప్రపంచం చిన్నదైపోయింది. దీంతో ప్రపంచం మొత్తానికి పరిచయమైపోతున్నారు వీళ్లు. అంతేకాదు, ప్రపంచ సినిమాల్లోని అత్యుత్తమ అభినయ విశేషాలన్నీ ఇప్పుడు వీళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రయోగాత్మక చిత్రాలన్నింటినీ వీళ్లు చూసేయొచ్చు. మేం సావిత్రిగారిని, శ్రీదేవిగారిని చూసి ‘ఓహో... ఇలా చేయాలా, ఇలా డ్రస్ చేసుకోవాలా’ అని నేర్చుకున్నవాళ్లం. కానీ వీళ్లు ఏంజెలీనా జోలీ, జెన్నీఫర్ లోపెజ్ లాంటి వాళ్లను కూడా చూసి అనుసరించవచ్చు. స్టయిల్స్ విషయంలో హాలీవుడ్‌కి తగ్గకుండా ముందుకెళ్లొచ్చు. ఇలియానా, కాజల్, తమన్నా... లాంటి వాళ్లను చూస్తుంటే హాలీవుడ్‌కి మనం ఏం తక్కువ అనిపిస్తుంది. కాస్త ఆలస్యంగా పుట్టి ఉంటే ఈ జనరేషన్ కథానాయిక అయ్యేదాన్నని ఎప్పుడైనా అనిపించిందా? వద్దండీ... ఈ సినిమాలే మాకొద్దు. ఈ పాత్రలే మాకొద్దు. వీటిని చూస్తున్నప్పుడు మేం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంటుంది. ఇప్పుడొస్తున్న దర్శకులు మాత్రం ప్రతిభావంతులు. వాళ్ల టేకింగ్ చాలా బావుంటుంది. వాళ్లతో వర్క్ చేయలేకపోవడం కాస్త బాధగా అనిపిస్తుంది. సరే... మీతో చేసిన హీరోలు ఇంకా హీరోలుగానే చలామణి అవుతున్నారు కదా. వాళ్లను చూస్తుంటే మీకేం అనిపిస్తుంది. మీ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? నిజంగా వాళ్లు అదృష్టవంతులు. అంబరీష్, చిరంజీవి లాంటివాళ్లు కేంద్రమంత్రులైపోయారు. ఇక రజనీ సార్ ఇప్పటికీ సూపర్‌స్టారే! నిజంగా వీళ్లందర్నీ చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. కలిసినప్పుడల్లా చిరంజీవి గారినీ, అంబరీష్ గారినీ ‘ఏం మినిస్టర్!’ అని ఎగతాళి చేస్తుంటాను. ఇప్పుడు బాలయ్య కూడా ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు కనిపిస్తే... ఆయనను కూడా ర్యాగింగ్ చేస్తా. వాళ్లకు కూడా మా తరం వాళ్లతోనే సౌకర్యంగా ఉంటుంది. అభిమానంగానూ ఉంటారు. అయితే, బాధ కలిగించే అంశం ఏంటంటే... శోభన్‌బాబుగారు, విష్ణువర్ధన్‌గారు చనిపోవడం. వాళ్లు పోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీ బాబాయ్ కమల్‌హాసన్ మీకేమైనా సలహాలిస్తుంటారా? ఆయన నుంచి విమర్శలు కానీ, ప్రశంసలు కానీ అందుతుంటాయా? బాబాయ్ లాంటి సిన్సియారిటీ ఉన్న కళాకారుణ్ణి నేను ఇప్పటివరకూ చూడలేదు. పాత్ర కోసం ఎంతటి హింస అనుభవించడానికైనా వెనుకాడరాయన. విమర్శలు, ప్రశంసలూ ఆయన నుంచి అందుతూనే ఉంటాయి. విమర్శలు ఆయన చేస్తే ‘ఓకే’. బయటివాళ్లు చేస్తే మాత్రం ఓ చెవితో విని, మరో చెవితో వదిలేస్తాను. (నవ్వుతూ). ఇన్నాళ్ల కెరీర్లో మీరు కష్టపడి చేసిన పాత్ర? ‘ముక్కుపుడక’. ఎందుకంటే అది నా నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర. అంద వికారంగా ఉండాలి. అమాయకంగా నటించాలి. ఆ పాత్ర చేస్తున్నప్పుడు చాలా కష్టపడ్డాను. తర్వాత కె.రాఘవేంద్రరావుగారి ‘ఆఖరి పోరాటం’లో నటించడానికి బాగా కష్టపడ్డాను. పూర్తి కమర్షియల్ కేరక్టర్ చేయడం నాకు కష్టమే. ఆ డాన్సులు, ఆ ఎక్స్ప్రెషన్లు కష్టంగా ఉండేవి. ఇప్పుడు ‘సచిన్’ సినిమాలో నటించారు కదా. ఇందులో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది? తమ్ముడి కోసం జీవితాన్ని త్యాగం చేసే అక్క పాత్ర. నా కెరీర్లో నేను చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఇందులో చేశానని నమ్మకంగా చెప్పగలను. ఎన్నో ఎమోషన్లు ఆ పాత్రలో ఉంటాయి. ఇంతకూ మణిరత్నంగారి సినిమా ఎప్పుడు? నాగార్జున, మహేశ్‌లతో సినిమా ఏమైంది? అది కొంచెం వాయిదా పడింది. ఆ వివరాలు త్వరలో చెబుతాం. మణి సినిమాల విషయంలో నా ప్రమేయం ఉండదు. త్వరలో ఓ మంచి సినిమా ఆయన నుంచి వస్తుంది. మీరెప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టుకుంటారు? మా అమ్మానాన్నల అనారోగ్య సమస్యల వల్ల చేయలేకపోతున్నాను. మళ్లీ నా నుంచి సినిమా రావడానికి ఓ అయిదారేళ్లు పడుతుంది. - బుర్రా నరసింహ