టైటిల్ : బలమెవ్వడు
నటీ నటులు : ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృద్వి రాజ్, నాజర్, సుహాసిని మణి రత్నంతదితరులు
బ్యానర్ : సనాతన దృశ్యాలు
నిర్మాత : ఆర్. బి. మార్కండేయలు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : సత్య రాచకొండ
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : సంతోష్, గిరి
విడుదల తేది : అక్టోబర్ 1, 2022
వైవిద్య భరితమైన కథాంశంతో వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నిస్తూ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా "బలమెవ్వడు". సనాతన దృశ్యాలు పతాకంపై ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా సత్య రాచకొండ దర్శకత్వంలో ఆర్ బి మార్కండేయులు ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటులు పృథ్వీరాజ్, సుహాసిని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "బలమెవ్వడు' చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం .
బలమెవ్వడు కథ ఏంటంటే..
సత్యనారాయణ (ధృవన్ కటకం) ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంటాడు. ఈ క్రమంలో పాలసీ కట్టించడానికి వెళ్లిన సత్యకు అక్కడే డ్యాన్స్ చేస్తున్న క్లాసికల్ డ్యాన్సర్ పరిణిక (నియా త్రిపాఠీ)ను చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ తరువాత ఓ ఘటనలో ఆకతాయిల నుంచి పరిణికని సత్య కాపాడుతాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురిస్తుంది. ఓ సారి పరిణికకు హెల్త్ బాగా లేదని హాస్పిటల్‌కు వెళ్తే క్యాన్సర్ ఉన్న విషయం బయటకు వస్తుంది. కీమోథెరఫీ చెయ్యాలి అంటాడు డాక్టర్ ఫణిభూషణ్ ఉరఫ్ పి.బి(పృథ్విరాజ్).పరిణికను అక్కడిక్కడే పెళ్లి చేసుకుంటాడు సత్య.
క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో ఎంతో పేరు గాంచిన పి.బీ.. మెడికల్ మాఫియాతో చేతులు కలపి బిజినెస్ చేస్తూ కోట్లు గడిస్తుంటాడు. అలాంటి పి. బి కి జీవితంలో ఊహించని షాక్ తగులుతుంది? పి.బి కి తగిలిన షాక్ ఏంటి? మెడికల్ మాఫియా ముసుగులో అందరినీ మోసం చేస్తూ బిజినెస్ చేస్తున్న పి. బీ కి "బలమెవ్వడు" ఆ బలాన్ని సత్య, యశోద ల బుద్ది బలంతో బలహీనునిగా చేసి అక్కడ జరిగే మెడికల్ మాఫియాకు ఎలాంటి గుణ పాఠం చెప్పారు ? అనేది ‘బలమెవ్వడు’ కథ.
ఎవరెలా నటించారంటే..
సత్యనారాయణ (ధృవన్ కటకం) సాధారణమైన మధ్య తరగతి యువకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. హీరోయిన్ పరిణిక (నియా త్రిపాఠీ) చాలా చక్కగా నటించింది. అందంగా కనిపించింది. డాక్టర్ ఫణిభూషణ్ ఉరఫ్ పి.బి(పృథ్విరాజ్) నటన ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. వయసులో ఉన్న వ్యక్తి గా, అలాగే వయసు మళ్ళిన పాత్రలో ఇలా రెండు షేడ్స్ లలో చాలా బాగా నటించాడు. వైద్యో నారాయణ హరీ అన్న పదానికి నిజాయితీ గల డాక్టర్ గా యశోద పాత్రలో సుహాసిని గారు చక్కగా నటించారు. రాఖీ సినిమా తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ దక్కినట్టు అనిపించింది. హాస్పిటల్ ఓనర్‌గా నాజర్ పాత్ర చిన్నదే అయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో చాలా బాగా చేశారు. పృథ్వి భార్య పాత్రలో అంజలి (పద్మ) మెప్పించింది. మిగిలిన వారంతా కూడా తమ పరిధి మేరకు నటించారు.
ఎలా ఉందంటే..
మెడికల్ మాఫియా వల్ల పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారు.. ఆరోగ్యం ఎలా చెడుతుంది అనేది చూపించారు. మెడికల్ మాఫియా ఆగడాలను ఎలా ఎదుర్కోవాలో అన్న పాయింట్‌తో చాలా ఇంట్రెస్ట్ కలిగించే అంశంతో టీం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకుని అందరికీ అర్థమయ్యేలా కథ, కథనాలను రాసుకొన్నారు. పైగా కమర్షియల్ అంశాల కోసం ఇందులో ప్రేమ కథను కూడా జోడించారు దర్శకుడు. సున్నితమైన హాస్యాన్ని కూడా జొప్పిస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. అంతర్లీనంగా సందేశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. కొత్త దర్శకుడే అయినా కూడా ప్రేక్షకులకు మాత్రం ఆ భావన కలగదు. ప్రతీ సీన్‌ను డీటైలింగ్‌గా తెరకెక్కించాడు.
మెడికల్ మాఫియాలో కావడంతో కథ, కథనాలు కాస్త జనాలకు కొత్తగా అనిపిస్తుంది. పాయింట్ కొత్తగా అనిపించినా కథనంలో మాత్రం పాత పద్దతే ఫాలో అయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ జరుగుతున్న ఈ కథ కొరకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడి తీసినట్టు కనిపిస్తుంది. అయితే లవ్ సీన్స్ మరీ రొటీన్‌గా అనిపిస్తాయి. ప్రథమార్థంలో అసలు కథ మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో కథనం పరిగెట్టినట్టు అనిపిస్తుంది. అయితే అక్కడక్కడా కథనం కాస్త నీరసంగా అనిపిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచేలా ఉంది. మాటలు అక్కడక్కడా బాగానే పేలినట్టు అనిపిస్తాయి. సంతోష్, గిరి సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. జస్విన్ ప్రభు ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment