Suhasini Respond On Hindi Language War: ప్రస్తుతం సినీ పరిశ్రమంలో హిందీ భాష వివాదం హాట్‌టాపిక్‌గా నిలిచింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య ట్విటర్ వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్‌పై సౌత్, నార్త్ సినీ సెలెబ్రెటీలు స్పందిస్తు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సుహాసిని హిందీ భాష వివాదంపై స్పందించారు.
చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్
నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ భాష చాలా బాగుంటుందని, అది కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు. హిందీ వాళ్లు మంచి వాళ్లని, వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలని చెప్పారు. అలాగే తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లేనని, హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని సుహాసిని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, మరికొంతమంది హిందీ మాట్లాడతారన్నారు.
చదవండి: లెటెస్ట్ అప్‌డేట్: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
ఆ తర్వాత ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే మనకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. దీంతో సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్‌లోనే ఉండాల్సిందంటూ సుహాసినిపై సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment