ప్రముఖ దర్శకుడు మణిరత్నం మొదటిసారిగా సోషల్ మీడియా లైవ్‌చాట్‌లోకి వచ్చారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఆసక్తి కనబరచని ఆయన తన భార్య, నటి సుహాసిని నిర్వహించిన లైవ్‌చాట్‌లో మొదటిసారిగా పాల్గొన్నారు. అంతేగాక సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండే ఆయన ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ లైవ్‌లో హీరో మాధవన్, నటి ఖుష్భు, అదితిరావ్ హైదరిలతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘మాధవన్ నువ్వు మణిరత్నం(ఆయన)కు గోల్ఫ్ ఆటను పరిచయం చేయడం ద్వారా ఆయన జీవితం మారిపోయింది’ అని సుహాసిని అన్నారు. అయితే ‘ఆటలో నన్ను ఓడించమని రత్నం సార్‌కు సవాలు విసిరాను.. కానీ ఆయన నాపై చెత్తను విసిరారు’ అంటూ చమత్కరించాడు. (నిర్మాతను టెన్షన్ పెడుతున్న హీరోయిన్)
అంతేగాక మణిరత్నం నిర్మించిన మాధవన్ ‘అలైపాయుతే’ సినిమాలోని ఓ రైలు సన్నివేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ.. ‘సన్నివేశం చిత్రీకరించడానికి ఆ సమయంలో రెండు రైళ్లు ఉన్నప్పటికీ.. నాకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్రీకరణపై ఆందోళన చెందాను’ అని చెప్పుకొచ్చారు. ఇక మధ్యలో నటి అను హాసన్ కలుగజేసుకుని మణిరత్నంపై రాపిడ్‌ఫైర్ ప్రశ్నలను సందించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌లో ఉన్న మీరు భార్య నుంచి ఎలా తప్పించుకుంటున్నారని అడగ్గా.. ‘లాక్‌డౌన్‌లో నేను నిశ్శబ్ధాన్ని పాటించడం నేర్చుకున్న’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రముఖ నటి పూనం ధిల్లాన్... ‘పాత్రల ఎంపికలో ఏలా ఉంటారు. అసాధారణమైన నటులను ఎన్నుకుంటారా లేక సాధారణ నటులను అసాధారణమైన వారిగా మార్చుకుంటారా’ అని అడిగారు. ‘నా నటీనటులను బాగా నటించమని వేడుకుంటాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్)
ఇక అదితి రావు హైదరి.. పాత్రలకు సరైన నటులను ఎలా అడగ్గా.. తనని కాస్తా ఇబ్బందికి గురి చేసే నటుల కోసమే నేను ఎప్పుడూ వెతుకుతానని చెప్పాడు. “ఇది కూడా ఓ మంచి అనుభూతి. ఎవరైనా మొదటి ఎంపికతోనే ఎల్లప్పుడూ ముగించ కూడదు. నిజానికి సరైనా ఎంపిక.. మనం చేసే సగం పనిని పూర్తి చేస్తుంది. అయితే నేను ఏది చెబితే అది మాత్రమే చేసే వారిని వెతకను. దానితో పాటు అదనంగా ఎదైన కొత్తగా చేయాలి’’ అని చెప్పారు. ఇక ఓటీటీ(ఓవర్ దీ టాప్) వంటి ప్లాట్‌ఫాంల కోసం సినిమా చేయడానికి లేదా చూపించడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని అభిమానులు అడిగిన ప్రశ్నకు.. “నేను 20 సంవత్సరాలుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పు నన్ను మీరు ఫుట్‌బాల్ ఆడమని అడిగితే ఆడలేను. అంతేగాక ఆ ఆటకు న్యాయం కూడా చేయలేను ” అంటు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాగా ప్రముఖ తమిళ ఇతిహాస నవల ఆధారంగా ఆయన తెరకెక్కించబోయే ‘పొన్నీన్ సెల్వన్’ను సీరిస్‌లుగా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సినిమాల్లో మీరు ఎప్పుడైనా నటించాలనుకుంటున్నారా అని ఓ అభిమాని అడిగ్గా... ఇదే ప్రశ్నను ఇది వరకే రజనీకాంత్ కుమార్తె ఆయనను అడిగినట్లు సుహాసిని చెప్పారు. దానికి ఆయన చేయనని వెంటనే సమాధానం ఇచ్చారని కూడా ఆమె తెలిపారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్‌లైన్‌లో మోసం)
Comments
Please login to add a commentAdd a comment