Instagram Live
-
ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అందరూ ఈజీగా ఫేమస్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటున్నారు. అందులో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. దాదాపు ప్రతిఒక్కరు ఈ యాప్‌ను వాడుతున్నారు. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపార, వృత్తి పరమైన అంశాలను పంచుకోవడానికి ఇదో వేదికగా మారింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా పరిగణిస్తున్నారు. కొంతమంది తమని తాము ఎక్కువ మందికి పరిచయం చేసుకోవడానికి ఫాలోవర్లను పెంచుకుంటే, కంపెనీలు, బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి, సెలెబ్రెటీలు తమ అభిమానులకు చేరువలో ఉండడానికి ఇలా ఎవరికి వారు ఇందులో ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి, అందులో ఫేమస్ అవ్వడానికి ఉన్న మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అకౌంట్ ఆప్టిమైజేషన్ అకౌంట్‌కు ఏదో ఒక పేరు పెట్టేసి, నాలుగు మాటలు రాసేసి, ఒక ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా అప్లోడ్ చేస్తే సరిపోదు. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్‌గా అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. బయోలో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను రాయాలి. ఒకవేళ ఏదైనా బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలంటే అందుకు సంబందించిన లింక్‌ను బయో, హోమ్ పేజీలో ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ల వాడకం మీ అకౌంట్‌ను రిప్రజెంట్ చేసేలా మంచి హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసాధారణమైన హ్యాష్ ట్యాగ్ మీకంటూ ఒక గుర్తింపుని తీసుకువస్తుంది. మీ ఆలోచనలను తెలియచెప్పడానికి హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగిస్తే, అవి మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తాయి. ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఎక్కువ మంది ఫాలోవర్లు రారనే విషయాన్ని గమనించాలి. కచ్చితమైన సమయంలో.. రోజులో ఏ సమయానికి పోస్ట్‌లు అప్లోడ్ చేయాలి.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే ఒక నిర్దేశిత క్యాలెండరు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని పోస్టులు పెడుతున్నారనే దానికంటే ఏ టైమ్‌లో పెడుతున్నాం అనేదే ముఖ్యం. మీ ఫాలోవర్లు ఎలాంటి సమయాల్లో పోస్టులు ఎక్కువగా చూస్తారో, ఎలాంటి పోస్టులు ఇష్టపడతారో ఒక సర్వే చేయాలి. వాటి ఆధారంగా పోస్టులని క్రియేట్ చేయాలి. లైవ్ వీడియోస్ చాలా మంది ఫొటోలు పోస్ట్ చేస్తున్నాం కదా, వీడియోస్ ఎందుకులే అనే ధోరణిలో ఉంటారు. వీటితోనే ఫాలోవర్లను పెంచుకుందాం అనుకుంటారు. మారుతున్న ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు వీడియోస్‌కే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీడియోస్, లైవ్ వీడియోస్ , స్టోరీలను అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! కంటెంట్‌పై దృష్టి కొంతమంది తమ బ్రాండ్‌ను పాపులర్ చేయాలనే క్రమంలో ఫాలోవర్లు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోరు. అలాంటి సందర్భాల్లో కొత్త ఫాలోవర్లు రాకపోగా, ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి, మీ ఫాలోవర్లు ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువ ఇష్టపడుతున్నారో రీసెర్చ్ చేయాలి. దానికి అనుగుణంగా మీరు కంటెంట్‌పై దృష్టి సారించాలి. ట్రెండింగ్ విషయాల గురించి పోస్టులు పెట్టాలి. -
ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే
ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇన్‌స్టా, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, పోలీసులు సకాలంలో స్పందించడంతో యువకుడిని క్షేమంగా రక్షించారు. మెటా ఈమెయిల్ అలారం ద్వారా స్పందించిన పోలీసులు 15 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకోవడంతో వ్యక్తి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు..యూపీలోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల అభయ్ శుక్లా అనే యువకుడు ప్రస్తుతం ఘజియాబాద్‌లోని విజయ్ నగర్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈవీడియోను గమనించిన కాలిఫోర్నియాలోని మెటా హెడ్‌క్వార్టర్స్ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు చెందిన సోషల్ మీడియా సెంటర్‌కు ఈమెయిల్ అలర్ట్ పంపింది. శుక్లా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ను కూడా పంపించింది. చదవండి: జమ్మూ కశ్మీర్లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు వెంటనే అప్రమత్తమైన యూపీ పోలీసులు వ్యక్తి వివరాలను ఘజియాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు.. అటు నుంచి విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఫోన్ నెంబర్ ఆధారంగా కేవలం 15 నిమిషాల్లోనే లోకేషన్ ట్రేస్ చేసి సంఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి ప్రాణాలు రక్షించారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే సోదరి వివాహం కోసం తల్లి కూడబెట్టిన 90,000 రూపాయలను శుక్లా అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మెత్తాన్ని బిజినెస్ వెంచర్లో తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించడంతో డబ్బులు అన్నీ పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయం ఇక మీదట తీసుకోవద్దని హెచ్చరించినట్లు చెప్పారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? -
లైవ్‌లో దొరికిపోయిన రష్మిక.. ఈ సారి ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా..!
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ జంట ఎక్కడికెళ్లినా ఇద్దరు ప్రత్యక్షమవుతుంటారు. ఇటీవల వ్యాకేషన్‌కు వెళ్లి సోషల్ మీడియాలో షేర్ ఫోటోలు షేర్ చేసి దొరికిపోయారు. తాజాగా మరోసారి రష్మిక మందన్నా ఫ్యాన్స్‌కు అడ్డంగా బుక్కైంది. ఇప్పటికే ఈ జంటపై సోషల్ మీడియాలో డేటింగ్ రూమర్స్ గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. రష్మిక తన ఇన్‌స్టాలో ఓ లైవ్ వీడియో చాట్ నిర్వహించింది. రష్మిక ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులు విజయ్ దేవరకొండను వాయిస్‌ను గుర్తించారు. ముద్దుగుమ్మ మాట్లాడుతుండగా మధ్యలో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. -
షణ్నూతో బ్రేకప్.. లైవ్‌లో ఏడ్చేసిన దీప్తి సునయన
Bigg Boss 5 Telugu, Deepthi Sunania: బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడికి వెళ్లినా అతడి ప్రియురాలు దీప్తి సునయన గురించే ఆరా తీశారు అభిమానులు. ఎప్పుడు కలుస్తారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఇద్దరూ కలిసి ఏవైనా సాంగ్స్ తీస్తున్నారా? అని వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి షణ్నూ త్వరలోనే దీపూను కలుస్తానని అప్పటిదాకా వెయిట్ చేయండని చెప్పాడు. కానీ న్యూ ఇయర్ రోజు ఈ జంట తమ ఐదేళ్ల రిలేషన్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు పెద్ద షాకిచ్చారు. బ్రేకప్ తర్వాత దీప్తి సునయన తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. ఇకపై నా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను' అని చెప్తూ దీప్తి తన కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసింది. -
వైరల్: ట్రయాంగిల్ లవ్‌స్టోరీపై క్లారిటీ ఇచ్చిన అషూ..
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇక అదే షోతో పొల్గొన్న రాహుల్ సిప్లిగంజ్‌తో బిగ్‌బాస్ అనంతరం ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట పునర్నవితో లవ్ ఎఫైర్ నడిపిన రాహుల్ షో అనంతరం అషూకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని పార్టీలకు వెళ్లడం, ఆ ఫోటోలను షేర్ చేయడంతో వీరి మధ్యా ఏదో ఉందనే గాసిప్ మొదలైంది. దీనికి తోడు అషూను ఎత్తుకొని ఫోటోకు ఫోజివ్వడం, ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులకు ప్రేమ సందేశాలు పంపుకోవడం, ఆ వెంటనే రాహుల్ లవ్ అనౌన్స్మెంట్ అంటూ అషూతో ఫోటో షేర్ చేయడం వంటివన్నీ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. దీంతో వీరిదరూ ప్రేమ మైకంలో మునిగిపోయారని కొందరు నెటిజన్లు పబ్లిక్‌గానే కామెంట్స్ చేశారు. అయితే ఇటీవలె ఓ షోలో పాల్గొన్న అషూ ఎక్స్‌ప్రెస్ హరి అనే కమెడియన్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఇది ట్రయాంగిల్ లవ్ అవుతుందేమోన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అటు హరి సైతం అషూ కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నాడు. దీంతో రాహుల్-అషూ మధ్యలో హరి అంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అషూకు ఇదే ప్రశ్న ఎదురైంది. హరి-రాహుల్‌లలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలంటూ ఫ్యాన్స్ కోరారు. దీంతో 'కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ' అషూ ఫన్నీగా బదులిచ్చింది . అంతేకాకుండా ఈ ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే, మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్ కూడా ఇచ్చేసింది. దీంతో మొత్తానికి ఈ లవ్కహానీ ట్రయాంగిల్ స్టోరీ అని అర్థమయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ హరి తన పేరుపై వేసుకున్న టాటూ గురించి స్పందిస్తూ..అది ఒకషో కోసమని, షోలో చాలా జరుగుతుంటాయని చెప్పింది. దీంతో ఆ టాటూ ఫేక్ అని తేలిపోయింది. -
నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్
కోలీవుడ్ లవ్ కపుల్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది నయనతార- విఘ్నేష్ శివన్‌ల జంటే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి బర్త్‌డే లాంటి వేడుకలు, పార్టీల్లో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ ఏడాది ఆఖరులో పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే విఘ్నేష్ ఆ వార్తలను ఖండించారు. ఈ జంట గురించి ఎప్పుడూ ఏదో ఓ వార్త హైలేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా విఘ్నేష్ శివన్ తన ఫాలోవర్స్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక నయనతారలో నచ్చే క్వాలిటీస్ ఏంటి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. నయన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు. ఇక నయనతారతో కలిసి దిగిన ఓ ఫోటను షేర్ చేస్తూ..ఇది తన ఫేవరేట్ పిక్ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అన్నాతే, కాతు వాకులా రెండు కాదల్, మూడో కన్ను, సహా మరో నాలుగు సినిమాలకు నయన్ సైన్ చేసింది. చదవండి : పెళ్లిపై నయనతార యూటర్న్; షాకైన విఘ్నేష్ పేరెంట్స్! బోర్ కొట్టినప్పుడే పెళ్లి -
ఇది నేను ఊహించలేదు, షాకయ్యా: సింగర్ సునీత
స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేగాక సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె కరోనా కాలంలో రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో లైఫ్ సెషన్ నిర్వహించి అభిమానులతో ముచ్చడిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తిక విషయాలను పంచుకుంటున్న సునీత అభిమానుల అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పడమే కాకుండా వారు అడిగిన పాటలు పాడుతు అలరిస్తున్నారు. అంతేగాక సమాజంలో జరిగే కొన్ని సంఘటనలపై కూడా ఆమె స్పందిస్తున్నారు. కాగా నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిన్నటి లైవ్‌లో ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీంతో లాక్డౌన్ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. లాక్డౌన్ అనగానే అందరూ నిత్యవసర సరుకులు, ఇతర సామాగ్రి కోసం షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ నన్ను బాధించే విషయమేంటంటే వైన్ షాపుల ముందు కూడా జనాలు బారులు తీరుతన్నారు. ఇది నేను ఊహించలేదు. ఇది నిజంగా బాధాకరం. లాక్డౌన్ వల్ల సమాజంలో కొంత మార్పు వస్తుందని అభిప్రాయపడ్డాను. కానీ ఈ సంఘన చూసి షాకయ్యా’ అంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యానించారు. కాగా కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయంగా సునీత ప్రతిరోజూ ఓ అరగంట పాటు లైవ్‌లోకి వచ్చి పాటలు పాడుతున్నారు. ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ తన గానామృతంతో ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నెటిజన్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్ పొందుతున్నామని చెప్పడంతో ఆమె ప్రతి రోజు లైవ్‌కి వస్తానని తెలిపారు. చదవండి: లైవ్‌లో సింగర్ సునీతను వాట్సాప్ నెం అడిగిన నెటిజన్.. -
లైవ్‌లో సింగర్ సునీతను వాట్సాప్ నెం అడిగిన నెటిజన్..
సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయంగా ప్రతిరోజూ ఓ అరగంట పాటు పాటలు పాడుతున్నారు. ఇన్‌స్టా లైవ్‌లో ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ తన గానామృతంతో కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్ పొందుతున్నామని అంటున్నారని, అందుకే ప్రతిరోజూ లైవ్‌కి వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పారు. మదర్స్ డే సందర్భంగా ఓ పాట పాడమని నెటిజన్ అడగ్గా అమ్మ అనగానే కంట్లోంచి నీళ్లు వస్తాయని, ఈ లోకంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ అని చెబుతూ సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్స్‌లో ఎంతోమందిని వైద్య సిబ్బంది బిడ్డలా చూసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సునీత పాటలు పాడుతుండగానే మరో నెటిజన్..వాట్సాప్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీనికి సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. తాను కూడా కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అత్యవసరం అయితే తప్పా ఎవరూ బయట తిరగొద్దని సూచించారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి : ఆ డైరెక్టర్ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత యాంకర్ శ్యామల, క్రికెటర్ భువనేశ్వర్ అక్కాతమ్ముళ్లా? -
సింగర్ సునీత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోతున్నానని చెప్పారు సింగర్ సునీత. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అయితే, కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు లైవ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వస్తున్నానని తెలిపారు. అత్యవసరమైన పనులు లేకపోతే ఇంటిపట్టునే ఉండాలని అభిమానులను కోరారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు పాటలను ఆలపించారు సింగర్ సునీత. నాగార్జున మూవీ ‘నేనున్నాను’ నుంచి ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని..’ పాట పాడి, దానిని వైద్యులు, ఇతర ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి అంకితం ఇచ్చారు. ఇకపై ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ క్యూట్ పెయిర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇద్దరికి దాదాపు ఒకే సమయంలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఒకనొక దశలో వీరిద్దరి మధ్య ప్రేమాయాణం నడుస్తుందనే పుకార్లు వచ్చినా తమ మధ్య ప్రేమ, దోమ ఏదీ లేదని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వీరి మధ్య వచ్చే రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడలేదు. ఇక డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరు ఇంత వరకు కలిసి నటించలేదు. దీంతో ఈ విజయ్-రష్మిక కాంబినేషన్ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన రష్మికను అభిమానుల నుంచి సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యింది. విజయ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారంటూ పలువురు నెటిజన్లు ఆమెను ప్రశ్నించగా..'ఈ విషయాన్ని మీరు డైరెక్ట్‌గా విజయ్‌నే అడగండి.. మంచి స్ర్కిప్ట్ వస్తే ఇద్దరం తప్పకుండా నటిస్తాం' అంటూ ఈ కన్నడ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ఇక వరుస ఆఫర్లతో బిజీ అయిన రష్మిక బాలీవుడ్లో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తోంది. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక ఇన్‌స్టా లైవ్‌లో వెల్లడించింది. త్వరలోనే ఈ మూవీ అప్డేట్స్ ప్రకటిస్తానని పేర్కొంది. దీంతో బాలీవుడ్‌లోనూ దూసుకుపోతుంది. రెండు హిట్లు పడితే తప్పకుండా అక్కడ కూడా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోవడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. -
ఎంత ఆస్తి ఉందో లైవ్‌లో చెప్పేసిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సోషల్ మీడియాలో ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు. అంతేకాకుండా నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో ధీటుగా బదులిస్తారు. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగబాబును ఉద్దేశించి ఓ నెటిజన్..'ఎంత ఆస్తి ఉంది నీకు'? అంటూ ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన నాగబాబు..అతడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'నన్ను నువ్వు అని సంబోధించావు..రెస్పెక్ట్ తగ్గిపోయింది సో నీ ప్రశ్నకు సమాధానం చెప్పను. మీకు మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే, ఎంత ఉందో చెప్పి నా ఆస్తిలో సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్' అంటూ తనదైన స్టైల్లో చురకలంటించారు. ఇక మరో నెటిజన్.. 'సర్ మీరు ఉండే ఇల్లు ఖరీదు రూ. 50 కోట్లు ఉంటుందా' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'ముకేష్ అంబానీ ఇంటి కంటే పది రూపాయలు తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టూ సేమ్' అని వ్యంగ్యంగా బుదలిచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి : అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు : నాగబాబు అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా! -
యాంకర్ అనసూయ అందానికి కారణం ఇదే!
ప్రముఖ యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తను చేస్తున్న ప్రాజెక్టుల గురించి అబ్డేట్స్ ఇస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగగ్రామ్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన అనసూయ పలు విషయాలపై చర్చించింది. ఈ సందర్భంగా 'మీకు తెలిసిన ఐదు హెల్త్ టిప్స్ మాతో పంచుకుంటారా' అని ఓ అభిమాని అడగ్గా.. వెంటనే ఆ డైట్ చార్ట్‌ని బయటపెట్టేసింది.'అందులో మొదటిది గోరువెచ్చని నీళ్లు తాగడం, ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. ఏదైనా తిన్న తర్వాత ఖాళీగా కూర్చోకుండా 30 నిమిషాల్లో ఏదో ఒక పని చేయాలి. రాత్రి భోజనం ఏడున్నర లోపు తీసుకోవాలి. ఇక చివరిది ఎంతో ముఖ్యమైనది...మీరు ఏదైనా పని చేసే ముందు దాన్ని ఎందుకు చేస్తున్నామో ఆలోచించి మొదలుపెట్టండి. అప్పుడు ఎలాంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉంటారు అని తెలిపింది. దీంతో అనసూయ అందానికి ఈ హెల్త్ టిప్సేకారణమంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం మలయళంలో డెబ్యూ మూవీ చేస్తున్న అనసూయ దానికి సంబంధించిన లుక్‌ను ఇప్పుడే రివీల్ చేయలేనని పేర్కొంది. అంతేకాకుండా మరో మూడు భాషల్లో సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించింది.అంతేకాకుండా పవన్ కల్యాణ్‌తో కలిసి ఓ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నానని, ఇందుకు సంబంధించిన అబ్డేట్స్ని త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొంది. చదవండి : అర్ధరాత్రి 2 గంటలకు తాగి ఉన్నా: అనసూయ షూటింగ్ : అలాంటి సీన్లు చేయడానికి నో పర్మిషన్ -
అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు : నాగబాబు
బుల్లితెరపై నాగబాబు హవా ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా కొన్ని షోలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి అంతంగా సక్సెస్ కాలేదు. దీంతో యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఇప్పటికే పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు..ప్రస్తుతం ఖుషీఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోకు జడ్జిగా ఉంటున్నారు. ఈ షో ద్వారా నాగబాబు తన సొంత యూట్యూబ్ చానెల్‌తో కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వీటికి వ్యూస్ రావడం లేదు. అంతేకాకుండా ఈ షోలో శృతిమించిన కామెడీ ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన నాగబాబుకు ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'ఖుషీ ఖుషీగా షో చూస్తున్నంతసేపు అసలు టైం తెలియదు..అప్పుడే ఫైనల్ వరకు వచ్చేసిందా.? అని పేర్కొనగా..దీనికి నాగబాబు స్పందిస్తూ..మీరు ఇప్పుడు ఇలానే అంటారు..చూసి షేర్ మాత్రం చేయరు..వ్యూస్ ఎక్కడ అండి వ్యూస్ అంటూ సెటైరికల్‌గా ఆన్సర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ ప్రపంచంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక సినిమా అదే! -
రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారికకు ఇటీవలె పెళ్లి చేసిన నాగబాబు..త్వరలోనే వరుణ్‌తేజ్‌ని సైతం ఓ ఇంటి వాడిని చేయాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికే పనిలో పడ్డారని సమాచారం. ఇదిలా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు తన రెండో పెళ్లిపై స్పందించారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న నాగబాబుకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. 'సర్..మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ఓ నెటిజన్ అడగ్గా..ఈ వయసులో నాకు పెళ్లా..మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే' అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చారు. రెండో పెళ్లిపై నాగబాబు చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ పలువురు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్‌పై కొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటున్నారంటే..మీ మనసులోనూ రెండో పెళ్లిపై ఆలోచన ఉందా?మీరు కూడా మీ తమ్ముడు పవన్‌కల్యాణ్ బాటలోనే నడుస్తారా' ? అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి : వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట వకీల్‌సాబ్ : ట్రైలర్‌కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే -
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్..షేర్ చేసిన యాంకర్
టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి..అప్పుడప్పుడు వెండితెరపై కూడా సందడి చేస్తుంటుంది. హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడుకు వెండితెర అంతగా కలిసి రాకపోయినా, బుల్లితెరపై మాత్రం ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. తనదైన యాంకరింగ్‌తో అలరించే శ్రీముఖి..ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ చాటింగ్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన తుంటరి ప్రశ్నకి శ్రీముఖి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. నగ్నంగా ఉన్న ఫోటో షేర్ చేయాల్సిందిగా ఓ అభిమాని కోరగా.. ఇందుకు రిప్లై ఇచ్చిన శ్రీముఖి..వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం' సినిమా పోస్టర్‌ను షేర్చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో శ్రీముఖి స్మార్ట్ ఆన్సర్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. సూపర్భ్ శ్రీముఖి..వాట్ ఎ రిప్లై అంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇక ఇటీవలె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. ‘లువీ’ అనే పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి ప్రవేపెట్టిన సంగతి తెలిసిందే. చదవండి : (వీడియోకాల్ మాట్లాడుతుండగా నటి రూమ్‌లోకి..) (పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్ కంటెస్టెంట్) -
లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్
తన జీవితంలో కొన్ని సంఘటనలు తనను బాధ పెట్టాయని, తనపై జరిగిన దుష్ప్రచారంపై మాట్లాడుతూ లైవ్‌లోనే హీరోయిన్ ఏడ్చేసింది. జరిగిన దాని గురించి బాధపడకుండా కోలుకుని చివరకు మిమ్మల్ని అలరిస్తానని ప్రకటించింది. ఆమెనే కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది. ఆమె డ్రగ్స్ కేసులో అరెస్టయి 145 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్‌పై విడుదలై ఇంటికొచ్చింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా తన అభిమానులతో మాట్లాడింది. ఈ క్రమంలో ఆవేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుంది. క్లిష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఈ సందర్భంగా రాగిణి కృతజ్ఞతలు తెలిపింది. తనపై జరిగిన దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసింది. 19.43 నిమిషాల పాటు ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా తనపై, తన కుటుంబంపై వచ్చిన ప్రచారం.. వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ కామెంట్స్ ఒకసారి మీరే చదువుకోండి అని సూచించింది. ‘మీ కుటుంబసభ్యులపై ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని రాగిణి హితవు పలికింది. దాని గురించి పెద్దగా ఆలోచించకపోయినా ఆ బాధ తనను వెంటాడుతూనే ఉందని కన్నీటి పర్యంతమైంది. కాలం ప్రతి గాయాన్ని నయం చేస్తుందని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. అయితే కొన్నాళ్లకు అన్ని విషయాల గురించి మాట్లాడుతానని చెప్పింది. ప్రస్తుతం తాను క్లిష్ట దశలో ఉన్నానని చెప్పింది. ‘ఇక మిమ్మల్ని నవ్విస్తాను.. ఫీల్ గుడ్ చేస్తానని.. వంట, ఫన్నీ వీడియోలతో మీ ముందుంటా’ అని రాగిణి తెలిపింది. మోడల్‌గా ఉన్న రాగిణి ద్వివేది సినిమాల్లోకి వచ్చారు. కన్నడలో వీర మడకరి, కెంపెగౌడ, శివ, బంగారి, రాగిణి ఐపీఎస్ సినిమాలతో గుర్తింపు పొందింది. View this post on Instagram A post shared by Ragini dwivedi (@rraginidwivedi) -
హీరోయిన్ ఫోటో అడిగిన ఫ్యాన్..
సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే అవకాశాలు, అదృష్టంతో పాటు.. లైమ్‌లైట్‌లో ఉండటం చాలా అవసరం. ఈ విషయంలో సోషల్ మీడియా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో తారలు తమకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభిమానలుతో షేర్ చేసుకోవడానికి.. వారితో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియానే వేదిక అవుతోంది. అందుకే ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. అయితే ఇక్కడ కూడా పనికిమాలిని వేషాలు వేసేవారు ఉంటారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఆనందిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో కొందరు సైలెంట్‌గా ఉంటే.. మరి కొందరు తగిన సమాధానం చెప్పి నోరు మూయిస్తారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. దాన్ని ఆమె హ్యాండిల్ చేసిన తీరుకు నెటిజనులు ఫిదా అయ్యారు.(చదవండి: ఆ హీరోయిన్ కావాలంటున్న త్రివిక్రమ్!)ఆ వివరాలు.. తాజగా పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటో షేర్ చేయమని కోరగా.. ఆయన కుమారుడు అభయ్‌రామ్‌తో దిగిన ఫోటోని షేర్ చేశారు పూజ. ఈ నేపథ్యంలో ఓ అభిమాని నగ్నంగా ఉన్న ఫోటో షేర్ చేయాల్సిందిగా కోరాడు. దానికి పూజా ఎవర్గ్రీన్ రిప్లై ఇచ్చారు. నగ్న ఫోటో రిక్వెస్ట్‌కి సమాధానంగా పూజ తన పాదాల ఫోటోని షేర్ చేసింది. వట్టి కాళ్ల ఫోటో చూసి నెటిజన్ కంగు తిన్నాడు. ఇక పూజ స్మార్ట్‌నెస్‌కి నెటిజనులు ఫిదా అయ్యారు. ‘‘టిట్ ఫర్ టాట్’’.. ‘‘దీని బదులు చెప్పు ఫోటో పంపిస్తే బాగుండేది’’.. ‘‘చాలా బాగా సమాధానం చెప్పారు’’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో పని చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు.(చదవండి: ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి) -
లైవ్‌లో నటుడి చెంప చెళ్లుమనిపించింది
హిందీ నటులు షెహనాజ్ గిల్-సిధార్థ్ శుక్లా.. బిగ్‌బాస్-13తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఇద్దరు తారలు.. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సిద్నాజ్’ పేరుతో లైవ్ సెషన్ నిర్వహించారు. సిద్నాజ్కు ఉన్న అభిమానుల గురించి మాట్లాడారు. ఈ వీడియోలో సిధార్థ్ లైవ్‌లో తమను ప్రత్యక్షంగా చూస్తోన్న అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘చూడండి మేం ఇద్దరం కలిసే ఉన్నాం. మరి మీరు దేని గురించి గొడవ పడుతున్నారు.. ఆందోళన చెందుతున్నారు’ అని అడిగారు. అంతేకాక కొందరు కావాలనే ద్వేషాన్ని ప్రచారం చేస్తారని.. అలాంటి వారిని పట్టించుకోవద్దని కోరారు. సిధార్థ్ ఇలా మాట్లాడుతుండగా అతని పక్కనే ఉన్న షెహ్నాజ్ అతడి చెంప మీద కొట్టింది. వెంటనే అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘సీరియస్‌గా కాదు. ట్రోల్ చేసేవారికి మీరు ఇలానే సమాధానం చెప్పండి’ అన్నది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. (చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్) View this post on Instagram Always positive like #sidnaaz ❤❤ . . . #sidnaaz #shehnaazgill #sidharthshukla #sidnaazforever💕💕 #sidnaazfam🌹💫 #stayblessed #stayhappy @realsidharthshukla @shehnaazgill A post shared by H€artb£@t_$idnaaz (@sidnaazmerijnn) on Aug 1, 2020 at 8:13pm PDT షెహ్నాజ్-సిధార్థ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీళ్లు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని ఇప్పటికే చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షెహ్నాజ్ తన ప్రేమను వ్యక్తపరిచినా.. సిధార్థ్ మాత్రం తాము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్నాడు. -
'ఆ స్థానం గురించి చర్చ అనవసరం'
ఢిల్లీ : టీమిండియాలో నాలుగోస్థానంపై ఎలాంటి అనుమానాలక్కర్లేదని, ఎందుకంటే ఆ స్థానం తనదేనంటూ భారత యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. సోమవారం ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ షోలో శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చర్చించాడు. 'భారత్ తరఫున ఏడాదిగా ఒక స్థానంలో స్థిరంగా ఆడుతున్నామంటే.. ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నట్లే. దాని గురించి ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నాలుగో నంబరు గురించి చర్చ నడిచినప్పుడు ఆ స్థానంలో దిగి నన్ను నేను నిరూపించుకోవడం సంతృప్తిగా ఉంది. కానీ టీమిండియాకు ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి.. పరిస్థితిని బట్టి ఏ స్థానంలోనైనా ఆడగలను' అని అయ్యర్ తెలిపాడు. గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు అంతకుముందు వెస్టిండీస్ సిరీస్‌లోనూ అయ్యర్ అంచనాలకు మించి రాణించాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో ఓ సెంచరీ సహా రెండు అర్ధ సెంచరీలతో 217 పరుగులు సాధించాడు. కాగా 25 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ 18 వన్డేల్లో 748 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌గా -
ఇన్‌స్టా లైవ్.. స్టార్ హీరోయిన్ తంటాలు
సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉండే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చేసిన ఓ తుంటరి పని అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. చాలా వరకు సెలబ్రటీలు ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు అందంగా ముస్తాబై ఏ టైంకి లైవ్‌కి వస్తున్నామో ముందే షేర్ చేస్తారు. అయితే అనుకోకుండా కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఆప్షన్ నొక్కారు. దీంతో నిజంగానే ఆమె లైవ్‌లోకి వచ్చారనుకొని చాలామంది ఫ్యాన్స్ లైవ్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక కొద్దిసేపటి వరకు అయోమయంలో పడిపోయింది. అనుకోకుండా ఏర్పడిన పరిస్థితి కావడంతో నేనెలా లైవ్‌కి వచ్చానురా బాబు అంటూ కత్రినా ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. (అర్జున్ ఫొటోకు కత్రినా కామెంట్!) అప్పటికే చాలామంది అభిమానులు లైవ్‌లో జాయిన్ అవడంతో ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి కాస్తా వైరల్ కావడంతో వావ్ కత్రినా మీరు మేకప్ లేకుండా కూడా చాలా బాగున్నారు. మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్బ్ అంటూ కత్రానాను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక కరోనాపై పోరుకు కత్రిన తన వంతు సాయంగా మహారాష్ట్ర సీఎం కేర్, పీఎం కేర్ రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ సహాయంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరిన సంగతి తెలిసిందే. కత్రిన తదుపరి చిత్రం సూర్యవంశీ మార్చి 24న విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. (దర్శకుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్) -
గొప్పగా నటించమని వేడుకుంటా: మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మొదటిసారిగా సోషల్ మీడియా లైవ్‌చాట్‌లోకి వచ్చారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఆసక్తి కనబరచని ఆయన తన భార్య, నటి సుహాసిని నిర్వహించిన లైవ్‌చాట్‌లో మొదటిసారిగా పాల్గొన్నారు. అంతేగాక సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండే ఆయన ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ లైవ్‌లో హీరో మాధవన్, నటి ఖుష్భు, అదితిరావ్ హైదరిలతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘మాధవన్ నువ్వు మణిరత్నం(ఆయన)కు గోల్ఫ్ ఆటను పరిచయం చేయడం ద్వారా ఆయన జీవితం మారిపోయింది’ అని సుహాసిని అన్నారు. అయితే ‘ఆటలో నన్ను ఓడించమని రత్నం సార్‌కు సవాలు విసిరాను.. కానీ ఆయన నాపై చెత్తను విసిరారు’ అంటూ చమత్కరించాడు. (నిర్మాతను టెన్షన్ పెడుతున్న హీరోయిన్) అంతేగాక మణిరత్నం నిర్మించిన మాధవన్ ‘అలైపాయుతే’ సినిమాలోని ఓ రైలు సన్నివేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ.. ‘సన్నివేశం చిత్రీకరించడానికి ఆ సమయంలో రెండు రైళ్లు ఉన్నప్పటికీ.. నాకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్రీకరణపై ఆందోళన చెందాను’ అని చెప్పుకొచ్చారు. ఇక మధ్యలో నటి అను హాసన్ కలుగజేసుకుని మణిరత్నంపై రాపిడ్‌ఫైర్ ప్రశ్నలను సందించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లో ఉన్న మీరు భార్య నుంచి ఎలా తప్పించుకుంటున్నారని అడగ్గా.. ‘లాక్డౌన్లో నేను నిశ్శబ్ధాన్ని పాటించడం నేర్చుకున్న’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రముఖ నటి పూనం ధిల్లాన్... ‘పాత్రల ఎంపికలో ఏలా ఉంటారు. అసాధారణమైన నటులను ఎన్నుకుంటారా లేక సాధారణ నటులను అసాధారణమైన వారిగా మార్చుకుంటారా’ అని అడిగారు. ‘నా నటీనటులను బాగా నటించమని వేడుకుంటాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్) View this post on Instagram Good evening. Hope u enjoyed the live sessions last 21 days. It was time to say good bye. But we had an amazing evening. Hope you all liked what was planned and what was spontaneous. Give us your feed. Especially those whose videos were played A post shared by Suhasini Hasan (@suhasinihasan) on Apr 14, 2020 at 9:08am PDT ఇక అదితి రావు హైదరి.. పాత్రలకు సరైన నటులను ఎలా అడగ్గా.. తనని కాస్తా ఇబ్బందికి గురి చేసే నటుల కోసమే నేను ఎప్పుడూ వెతుకుతానని చెప్పాడు. “ఇది కూడా ఓ మంచి అనుభూతి. ఎవరైనా మొదటి ఎంపికతోనే ఎల్లప్పుడూ ముగించ కూడదు. నిజానికి సరైనా ఎంపిక.. మనం చేసే సగం పనిని పూర్తి చేస్తుంది. అయితే నేను ఏది చెబితే అది మాత్రమే చేసే వారిని వెతకను. దానితో పాటు అదనంగా ఎదైన కొత్తగా చేయాలి’’ అని చెప్పారు. ఇక ఓటీటీ(ఓవర్ దీ టాప్) వంటి ప్లాట్‌ఫాంల కోసం సినిమా చేయడానికి లేదా చూపించడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని అభిమానులు అడిగిన ప్రశ్నకు.. “నేను 20 సంవత్సరాలుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పు నన్ను మీరు ఫుట్‌బాల్ ఆడమని అడిగితే ఆడలేను. అంతేగాక ఆ ఆటకు న్యాయం కూడా చేయలేను ” అంటు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాగా ప్రముఖ తమిళ ఇతిహాస నవల ఆధారంగా ఆయన తెరకెక్కించబోయే ‘పొన్నీన్ సెల్వన్’ను సీరిస్‌లుగా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సినిమాల్లో మీరు ఎప్పుడైనా నటించాలనుకుంటున్నారా అని ఓ అభిమాని అడిగ్గా... ఇదే ప్రశ్నను ఇది వరకే రజనీకాంత్ కుమార్తె ఆయనను అడిగినట్లు సుహాసిని చెప్పారు. దానికి ఆయన చేయనని వెంటనే సమాధానం ఇచ్చారని కూడా ఆమె తెలిపారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం) -
బాయ్‌ఫ్రెండ్ ద్రోహం చేశాడని..లైవ్‌లో
ఫగ్వారా : ప్రియుడు మోసం చేశాడని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది ఓ పంజాబీ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషియాపూర్ జిల్లాకి చెందిన మనీషా(18) ఫగ్వారాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. గత గురువారం రాత్రి ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్ పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ‘ నా బాయ్‌ఫ్రెండ్ ఇందర్ నాకు ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. అది నేను తట్టుకోలేక పోతున్నా. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. లేఖలో ప్రియుడి పేరు మాత్రమే రాసి ఉందని, అతని వివరాలు ఏమీ లేవని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్ డేటా పరిశీలిస్తున్నామని..త్వరలోనే మనీషా ప్రియుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. భువనగిరిలో మరో యువతి ఆత్మహత్య తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మానస అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడని, శారీరంగా వాడుకున్నాడని, తన తల్లిని కూడా ఏమైనా చేస్తాడేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి స్వస్థలం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ స్టా'గన్' ట్రాజెడీ!
గన్‌తో వీడియో.. బాలుడి ప్రాణాలు తీసింది వాషింగ్టన్: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలన్న కాంక్షతో కొంతమంది చేస్తున్న అల్లరి పనులు వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఓ పదమూడేళ్ల బాలుడు గన్‌తో తాను ఉన్న లైవ్ వీడియో క్లిప్‌ను సామాజిక మాద్యమం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయాలన్న కోరిక అతడి ప్రాణాలు పోయేలా చేసింది. మాలాచీ హెంపిల్ అనే బాలుడు తన తల్లి, సోదరితో కలసి అమెరికాలోని జార్జియా నగరంలో నివసిస్తున్నాడు. బాలుడి స్నేహితుల్లో ఒకరు అతన్ని తుపాకీతో ఫోజులిస్తు వీడియో ఎందుకు పెట్టకూడదు అని అడిగారు. దీంతో వెంటనే ఆ బాలుడు మరొకరి వద్ద నుంచి తుపాకీని తీసుకుని ఇన్‌స్ట్రాగామ్‌లో లైవ్ వీడియో పెడుతుండగా పొరపాటున అది పేలింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ వీడియోను చూస్తున్న దాదాపు 50 మంది యూజర్లు బాలుడి ఇంటికి వచ్చినట్లు బాలుడి సోదరి తెలిపింది. ఇప్పటికైనా తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పిల్లలు వ్యవహరిస్తున్న తీరుపై నిఘా ఉంచాలని చెబుతున్నారు. బాలుడికి తుపాకీ ఎవరు ఇచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.