ఇన్ స్టా'గన్' ట్రాజెడీ!
గన్‌తో వీడియో.. బాలుడి ప్రాణాలు తీసింది
వాషింగ్టన్: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలన్న కాంక్షతో కొంతమంది చేస్తున్న అల్లరి పనులు వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఓ పదమూడేళ్ల బాలుడు గన్‌తో తాను ఉన్న లైవ్ వీడియో క్లిప్‌ను సామాజిక మాద్యమం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయాలన్న కోరిక అతడి ప్రాణాలు పోయేలా చేసింది.
మాలాచీ హెంపిల్ అనే బాలుడు తన తల్లి, సోదరితో కలసి అమెరికాలోని జార్జియా నగరంలో నివసిస్తున్నాడు. బాలుడి స్నేహితుల్లో ఒకరు అతన్ని తుపాకీతో ఫోజులిస్తు వీడియో ఎందుకు పెట్టకూడదు అని అడిగారు. దీంతో వెంటనే ఆ బాలుడు మరొకరి వద్ద నుంచి తుపాకీని తీసుకుని ఇన్‌స్ట్రాగామ్‌లో లైవ్ వీడియో పెడుతుండగా పొరపాటున అది పేలింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ వీడియోను చూస్తున్న దాదాపు 50 మంది యూజర్లు బాలుడి ఇంటికి వచ్చినట్లు బాలుడి సోదరి తెలిపింది. ఇప్పటికైనా తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పిల్లలు వ్యవహరిస్తున్న తీరుపై నిఘా ఉంచాలని చెబుతున్నారు. బాలుడికి తుపాకీ ఎవరు ఇచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.