పోర్చుగల్‌పై సంచలన విజయం
గెల్‌సెన్‌కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో పాల్గొంటున్న తొలిసారే జార్జియా జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జార్జియా 2–0 గోల్స్ తేడాతో 2016 చాంపియన్ పోర్చుగల్ జట్టుపై సంచలన విజయం నమోదు చేసింది. రెండో నిమిషంలోనే క్వరాత్‌స్కెలియా గోల్‌తో జార్జియా 1–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను మికాట్జె లక్ష్యాన్ని చేర్చడంతో జార్జియా ఆధిక్యం 2–0కు పెరిగింది.
ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న జార్జియా విజయాన్ని ఖాయం చేసుకుంది. పోర్చుగల్ దిగ్గజ ప్లేయర్, కెపె్టన్ క్రిస్టియానో రొనాల్డో 66 నిమిషాలపాటు ఆడి ఆ తర్వాత మైదానం వీడాడు. రొనాల్డోను పక్కా ప్రణాళికతో కట్టడి చేయడంలో జార్జియా డిఫెండర్లు సఫలమయ్యారు. జార్జియా చేతిలో ఓడినప్పటికీ ఇదే గ్రూప్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పోర్చుగల్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
గ్రూప్ ‘ఎఫ్’లోని మరో మ్యాచ్‌లో టర్కీ 2–1తో చెక్ రిపబ్లిక్‌ను ఓడించి నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారంతో యూరో టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. ఈనెల 29 నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌తో ఇటలీ; ఇంగ్లండ్‌తో స్లొవేకియా; డెన్మార్క్‌తో జర్మనీ; స్పెయిన్‌తో జార్జియా; బెల్జియంతో ఫ్రాన్స్; స్లొవేనియాతో పోర్చుగల్; రొమేనియాతో నెదర్లాండ్స్; ఆ్రస్టియాతో టర్కీ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment