Pooja khedkar: కూతురే కాదు త‌ల్లి కూడా అదే దందా.. వీడియో వైర‌ల్‌ | Old Video Of IAS Officer Puja Khedkar Mother Waving Gun At Farmers, Watch Inside Video | Sakshi
Sakshi News home page

Pooja khedkar: కూతురే కాదు త‌ల్లి కూడా అదే దందా.. వీడియో వైర‌ల్‌

Published Fri, Jul 12 2024 2:25 PM | Last Updated on Fri, Jul 12 2024 5:03 PM

Old VideoOf IAS Officer Puja Khedkar Mother Waving Gun At Farmers

ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్క‌ర్ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొహిబిష‌న్ స‌మయంలో పూర్తి స్థాయి అధికారిగా హ‌ల్‌చ‌ల్ చేసిన ఆమె.. ఉన్న‌తస్థాయి అధికారుల ఆగ్ర‌హానికి గురైన‌ బ‌దిలీ వేటు ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారిన ఈమె వ్య‌వ‌హారంలో మ‌రో ర‌చ్చ మొద‌లైంది. కూతురే కాదు.. ఆమె తండ్రి, త‌ల్లి చేసిన అరాచ‌కాలు కూడా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

తాజాగా పూజా ఖేద్క‌ర్ త‌ల్లికి చెందిన ఓ వీడియో వివాదస్ప‌దంగా మారింది. అయితే ఇది పాత వీడియోనే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేద్క‌ర్‌... కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పుణే జిల్లాలోనే ముల్షీ తాలుకాలో ఓ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.

అయితే పక్కనే ఉన్న రైతుల భూముల్నీ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం వద్దే పెద్ద గొడవైంది. రైతులు వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్ తన సెక్యూరిటీ గార్డులతో అక్క‌డ‌కు  చేరుకున్నారు. చేతిలో తుపాకీ తీసుకొచ్చిఇ రైతుల‌ను బెదిరించారు.

గన్‌ చూపిస్తూ "ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కుడున్నాయో చూపించు" అని బెదిరించింది. అందుకు ఆ వ్యక్తి తన పేరుపైనే ల్యాండ్ రిజిస్టర్ అయ్యుందని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు. "కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో చూసుకో...నాకే రూల్స్ చెప్పకు" అని తుపాకీతో అత‌డికి వార్నింగ్ ఇచ్చింది.

కాగా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పోలీస్‌ కేసు పెడదామని చూసినా ఎవరూ సహకరించలేదని రైతులు చెబుతున్నారు. మ‌రోవైపు  పూజే ఖేడ్కర్‌కి 5 ప్లాట్‌లున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలో రెండు అపార్ట్‌మెంట్‌లు ఉన్న‌ట్లు తేల‌లింది. వీటి విలువ రూ.22కోట్లు. అహ్మద్‌నగర్‌లో రూ.45 లక్షల విలువ చేసే అపార్ట్‌మెంట్ ఉంది.

నింగ్‌లో ఉండగానే గొంతెమ్మ కోరికలు కోరి  వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె వినియోగించే ఖరీదైన ఆడీ కారుపై ఉన్న 21 చలాన్లు కట్టకుండా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.26,000.  అమె రిక్రూట్‌మెంట్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా లోపం ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ చూపించినట్టు తేలింది. మెడికల్ టెస్ట్‌లు జరగకుండా మేనేజ్ చేసి రిక్రూట్ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement