Trainee IAS officer
-
పూజా ఖేద్కర్‌కు మరో షాక్.. అరెస్టు తప్పదా?
ఢిల్లీ : వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. అధికార దుర్వినియోగంతో పాటు, ఐఏఎస్‌కు ఎంపిక అయ్యేందుకు నకిలీ పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. #BREAKING Delhi High Court denies anticipatory bail to former probationer IAS officer Puja Khedkar accused of “misrepresenting and falsifying facts" in her UPSC application. #PujaKhedkar #UPSC pic.twitter.com/mgw3QYhaux— Live Law (@LiveLawIndia) December 23, 2024పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..జస్టిస్ చంద్ర ధరి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. పూజా ఖేద్కర్ ఉద్దేశ పూర్వకంగానే ఐఏఎస్ ఎంపిక అయ్యేందుకు అధికారులను మోసగించినట్లు తాము గుర్తించాం. ఆమె కుట్ర పూరితగా చర్యలు ఐఏఎస్‌కు అనర్హులు. ఆమెపై నమోదైన ఫోర్జరీ, మోసం వంటి అభియోగాలు ‘అధికారం కోసమే కాకుండా, దేశం మొత్తాన్ని మోసం చేశారనే దానికి ఉదాహరణ నిలుస్తారు.‘పిటిషనర్ (పూజా ఖేద్కర్) ప్రవర్తన పూర్తిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ పత్రాలు సమర్పించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న పథకాల ప్రయోజనాలను పొందేందుకు భారీ ఎత్తున మోసానికి తెరతీశారు.’ ‘ప్రస్తుతం కేసు దర్యాప్తు, అందుబాటులో ఉన్న రికార్డ్ల ఆధారంగా పూజా ఖేద్కర్ వెనుకబడిన వర్గాలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందేందుకు అనర్హులు. దీంతో పాటు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో కుమ్మక్కయ్యే అవకాశం ఉంది’. దీంతో ప్రభుత్వ అధికారులు, సంబంధిత విభాగాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉండననుంది.వివాదాస్పద కేసులో గతంలో పూజా ఖేదర్కర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలిచ్చిన జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఏక సభ్య ధర్మాసనం.. ఈ రోజు విచారణలో ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో పోలీస్ శాఖ పూజా ఖేద్కర్ అరెస్ట్ తప్పదన్న చర్చ మొదలైంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కారు. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటు చేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు.అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా యూపీఎస్సీ రాత పరీక్ష నుంచి ఆమె ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ఎంపిక అవ్వడం వరకూ పూజా ఖేద్కర్ చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమెపై కోర్టులో కేసు నడుస్తోంది. నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది.ఐఏఎస్ సర్వీస్ నుంచి తొలగింపుఇలా వరుస వివాదాల నేపథ్యంలో కేంద్రం పూజా ఖేద్కర్‌పై విచారణకు ఆదేశించింది. విచారణాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.ముందస్తు బెయిల్ తిరస్కరణఈ వివాదంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు మార్లు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. తాజాగా, సోమవారం సైతం ఢిల్లీ హైకోర్టు పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. -
Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్.. ఆమె తండ్రిపై కేసు ఫైల్
ముంబై: దేశంలోనే వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పూణే కలెక్టరేట్లో ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు దిలీప్ ఖేద్కర్‌పై నమోదైంది.వివరాల ప్రకారం.. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చిన సమయంలో ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ హంగామా క్రియేట్ చేశారు. పూణేలోకి కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. అక్కడి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆఫీసులో ఉన్న సిబ్బందిని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తన కూతరు పూజా ఖేద్కర్‌కు క్యాబిన్ కేటాయించాలని డిమాండ్ చేసినట్టు కలెక్టరేట్‌కు చెందిన తహసీల్దార్ దీపక్ అకాడే తెలిపారు. ఇక, ఈ విషయమై అకాడే పోలీసులకు దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.Maharashtra | A case has been registered against Dilip Khedkar - father of former IAS trainee officer Puja Khedkar under IPC sections 186, 504 and 506 at Bundgarden Police station last night: DCP Smarthna Patil, Pune PoliceWhile Puja Khedkar was posted at the Pune Collector's…— ANI (@ANI) August 9, 2024మరోవైపు.. ఇప్పటికే పూజా ఖేద్కర్ పేరెంట్స్ పలు వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఓ భూవివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని గన్‌తో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెపైనా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తాజాగా ఆమె తండ్రిపై కేసు నమోదైంది.ఇదిలా ఉండగా.. పూణే ఖేద్కర్ ఎపిసోడ్లో తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందినట్టు తేలడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ ఎంపికను రద్దు చేసిన విషయం విధితమే. -
పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్.. అన్ని పరీక్షల నుంచి శాశ్వత డిబార్
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ప్రొవిజినల్ అభ్యర్ధిత్వాన్ని యూపీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. అదే విధంగా భవిష్యత్తులోనూ కమిషన్ నిర్వహించే ఏ ఇతర పరీక్షలకు హాజరు అవ్వకుండా ఆమెపై నిషేధం విధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ) నిబంధనలను ఉల్లంఘించినందుకు పూజా దోషిగా తేలినట్లు నిర్ధారించిన కమిషన్ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.కాగా పూజా ఖేద్కర్‌కు 18 జూలైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జూలై 25 లోపు సమాధానం చెప్పాలని కోరింది. అయితే ఆమె ఆగస్టు 4 వరకు సమయం కావాలని కోరగా.. యూపీఎస్సీ జూలై 30 వరకు డెడ్‌లైన్ విధించింది. ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. గడువులోగా స్పందన రాకపోతే చర్యలు తీసుకునే విషయంపై కూడా యూపీఎస్సీ ఆమెకు వెల్లడించింది. ఇక నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వడంతో పూజా విఫలమవ్వడంతో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్ పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం కోసం తప్పుడు పత్రాల సమర్పణ, అంగ వైకల్యం, మానసిక వైకల్యాల గురించి అబద్దాలు చెప్పడమే కాకుండా సాధారణ కేటగిరీలో అనుమతించిన ఆరు కంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసినట్లు తెలిపింది. .తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్/సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడినట్లు వివరించింది. పుణెలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సర్కార్ ఆమెను మరో చోటుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆమె వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుంది. యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించడం, మెడికల్ టెస్టులకు హాజరు కాకపోవడం బయటపడింది. దీంతో పూజా ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ యూపీఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఖేద్కర్ తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్‌పై పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఖేద్కర్ తల్లి మనోరమ కూడా భూ వివాదం కేసులో రైతలను తుపాకీతో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఫీసర్ పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. -
యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి. మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు?: ఖర్గే మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్‌గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
తుపాకీతో రైతులను బెదిరింపు.. పూజా ఖేద్కర్ తల్లి అరెస్ట్
ముంబై: అధికార దుర్వినియోగం, తప్పుడు ధృవీకరణ పత్రాల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. భూ వివాదంలో రైతులను తుపాకీతో బెదిరించిన పూజా తల్లి మనోరమ అరెస్ట్ అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగిఉన్నారన్న ఆరోపణల కింద ఆమెను గురువారం పుణె పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజులుగా పూజాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఇటీవల ూణే జిల్లాలోని ముల్షి గ్రామంలో భూ వివాదంపై స్థానిక రైతులతో ఆమె పిస్తోల్‌తో బెదిరిస్తున్నట్లున్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.కాగా పుణెలో అదనపు కలెక్టర్‌గా శిక్షణా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే ఐఏఎస్‌లకు ఈ సౌకర్యాలు ఉండవు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్కు బదిలీ చేసింది.మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు తప్పించుకు వచ్చారు. చివరికి ఆరోసారి పిలవగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది.పూజాపై వివాదాలు ముదరడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలు మొదలుపెట్టింది. ఆమెను శిక్షణ విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
పూజా ఖేద్కర్ ఇంటిపై బుల్డోజర్ చర్య
ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. అధికార దుర్వినియోగం, అధికారులపై బెదిరింపులు, సివిల్స్ ఎంపిక విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించడం, వయసు వ్యత్యాసం, ఫేక్ అడ్రస్.. ఇలా ప్రతిచోటా అధికారులను మభ్యపెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.తాజాగా పూజా ఖేద్కర్ కుటుంబానికి చెందిన పుణెలోని నివాసంపై అధికారులు బల్డోజర్ చర్య పేపట్టారు. ఆమె నివాసం ఇంటికి ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను పుణె మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్తో కూల్చేసింది. ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చెట్లు, పూల మొక్కలు పెంచారు. దీనిపై దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అధికారులు వెల్లడించారు. #WATCH | Maharashtra: Action being taken against illegal encroachment at IAS trainee Pooja Khedkar's Pune residence. pic.twitter.com/xvBQhxxtIO— ANI (@ANI) July 17, 2024 కాగా పుణెలో అదనపు కలెక్టర్‌గా శిక్షణా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే ఐఏఎస్‌లకు ఈ సౌకర్యాలు ఉండవు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్కు బదిలీ చేసింది. మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు తప్పించుకు వచ్చారు. చివరికి ఆరోసారి పిలవగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది.ఇక తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పూజా ఖేడ్కర్ ఎంబీబీఎస్‌లో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. నాన్ క్రిమీలేయర్ ఓబీసీ ధ్రువీకరణపత్రంతో పుణెలోని ఓ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారని తెలిసింది. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. దీనిని మెడికల్ కాలేజీ కూడా ధ్రువీకరించింది.పూజాపై వివాదాలు ముదరడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలు మొదలుపెట్టింది. ఆమెను శిక్షణ విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
ఢిల్లీ: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగం, తప్పుడు ధృవీకరణ పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజాపై చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో ఆమె ట్రైనింగ్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఈ మేరకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్ రీకాల్ ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపిక అయ్యేందుకు వైకల్యం,ఓబీసీ సర్టిఫికేట్లను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన తదుపరి చర్యల నిమిత్తం ఆమెను జూలై 23లోగా అకాడమీకి రావాల్సిందిగా తెలిపింది.ఐఏఎస్ ఉద్యోగంలో చేరేందుకు పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. 2018, 2021లో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ అందించిన రెండు సర్టిఫికేట్లను బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ (PwBD) కేటగిరీ కింద యూపీఎస్సీకి సమర్పించారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమెను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. కానీ ఆమె 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఆరుసార్లు మెడికల్ టెస్టులకు డుమ్మా కొట్టింది.మరోవైపు పూజా ఖేద్కర్ తనకు కంటి సమస్యలు ఉన్నట్లు ఆగష్టు 2022లో పూణేలోని ఔంధ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైకల్య ధృవీకరణ పత్రం కోసం పూజా దరఖాస్తు చేసుకోగా.. వైద్య పరీక్షల తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదో ఒక రకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ ఎంపికను.. కమిషన్ ట్రిబ్యూనల్‌లో సవాలు చేయగా.. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. అయినా.. పూజా ఖేద్కర్ మాత్రం ఐఏఎస్‌గా ట్రైనింగ్ పొందడం గమనార్హం. ఈమె వివాదంపై దర్యాప్తునకు కేం ద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. -
Pooja khedkar: కూతురే కాదు తల్లి కూడా అదే దందా.. వీడియో వైరల్
ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొహిబిషన్ సమయంలో పూర్తి స్థాయి అధికారిగా హల్చల్ చేసిన ఆమె.. ఉన్నతస్థాయి అధికారుల ఆగ్రహానికి గురైన బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈమె వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది. కూతురే కాదు.. ఆమె తండ్రి, తల్లి చేసిన అరాచకాలు కూడా బయటపడుతున్నాయి.తాజాగా పూజా ఖేద్కర్ తల్లికి చెందిన ఓ వీడియో వివాదస్పదంగా మారింది. అయితే ఇది పాత వీడియోనే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేద్కర్... కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పుణే జిల్లాలోనే ముల్షీ తాలుకాలో ఓ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.అయితే పక్కనే ఉన్న రైతుల భూముల్నీ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం వద్దే పెద్ద గొడవైంది. రైతులు వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్ తన సెక్యూరిటీ గార్డులతో అక్కడకు చేరుకున్నారు. చేతిలో తుపాకీ తీసుకొచ్చిఇ రైతులను బెదిరించారు.గన్ చూపిస్తూ "ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కుడున్నాయో చూపించు" అని బెదిరించింది. అందుకు ఆ వ్యక్తి తన పేరుపైనే ల్యాండ్ రిజిస్టర్ అయ్యుందని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు. "కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో చూసుకో...నాకే రూల్స్ చెప్పకు" అని తుపాకీతో అతడికి వార్నింగ్ ఇచ్చింది.IAS officer Pooja Khedkar's father, Dilip Khedkar, has allegedly amassed wealth and bought 25 acres in Mulshi tehsil, Pune. The family reportedly tried to encroach on neighboring land, and Pooja's mother, Manorama Khedkar, allegedly threatened farmers with a pistol. Attempts… pic.twitter.com/KlETPBXBmb— Sneha Mordani (@snehamordani) July 12, 2024కాగా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పోలీస్ కేసు పెడదామని చూసినా ఎవరూ సహకరించలేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు పూజే ఖేడ్కర్‌కి 5 ప్లాట్లున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నట్లు తేలలింది. వీటి విలువ రూ.22కోట్లు. అహ్మద్‌నగర్‌లో రూ.45 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది.నింగ్‌లో ఉండగానే గొంతెమ్మ కోరికలు కోరి వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె వినియోగించే ఖరీదైన ఆడీ కారుపై ఉన్న 21 చలాన్లు కట్టకుండా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.26,000. అమె రిక్రూట్‌మెంట్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా లోపం ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ చూపించినట్టు తేలింది. మెడికల్ టెస్ట్‌లు జరగకుండా మేనేజ్ చేసి రిక్రూట్ అయింది. -
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ బానోత్ కొడుకు మృగేందర్‌లాల్ బానోత్ (30)పై చీటింగ్ కేసు నమోదయింది. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, అత్యాచారం చేశాడని ఓ యువతి మృగేందర్‌లాల్‌పై గత నెల 27వ తేదీన కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మృగేందర్‌లాల్‌తో పాటు మాజీ ఎమ్యెల్యే మదన్‌లాల్ బానోత్‌పై కేసులు నమోదయ్యాయి. యువతి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ఐపీఎస్‌కు ఎంపికైన మృగేందర్ శివరాంపల్లిలోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందే సమయంలో కూకట్‌పల్లికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రతి రోజూ ఆమెతో చాటింగ్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గతేడాది డిసెంబర్ 25న పథకం ప్రకారం యువతిని తన రూమ్‌కు తీసుకెళ్లి బలవంతం చేయబోయాడు. కానీ, ఆమె ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గాడు. కొద్దిరోజుల అనంతరం తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తానని, అకాడమీకి రావాలని చెప్పడంతో ఆ యువతి నమ్మి వెళ్లింది. అక్కడ తన కోరికను తీర్చకపోతే వివాహం చేసుకోనని బ్లాక్మెయిల్ చేయడంతో వేరే మార్గం లేక ఆ యువతి అంగీకరించింది. ఇక ఆ తరువాత ముఖం చాటేసిన మృగేందర్ పలుమార్లు ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినా రకరకాల కారణాలతో వాయిదా వేస్తూ వచ్చాడు. గతేడాది ఆగస్టులో మృగేందర్‌లాల్ ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎస్‌కు రాజీనామా చేసి ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో చేరాడు. అక్కడ మృగేందర్‌కు మరొక అమ్మాయితో (ఐఏఎస్ బ్యాచ్‌మేట్) దగ్గరి సంబంధం ఉందని ఆ యువతి నిలదీయడంతో మృగేందర్ తండ్రి మదన్‌లాల్ బానోత్ యువతికి రూ.25 లక్షల నగదు ఇస్తానని ఆశ చూపించాడు. యువతి ఒప్పుకోకపోవడంతో చంపేస్తామని ఆమె కుటుంబ సభ్యుల ముందే బెదిరించాడు. ఈ ఏడాది జూలై 31వ తేదీన మృగేందర్ యువతి ఇంటికి వచ్చి బలవంతంగా ఆమె సెల్‌ఫోన్ ధ్వంసం చేసినట్లుగా యువతి ఆరోపిస్తోంది. దీంతో ఆమె న్యాయం చేయాలని కోరుతూ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కేసు వివరాలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రతినిధి సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించగా.. అలాంటి కేసు ఏమీ నమోదు కాలేదని పోలీసులు వెల్లడించడం విశేషం. -
శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్
సాక్షి, అమరావతి: శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సబ్‌కలెక్టర్‌గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, తెనాలి సబ్‌కలెక్టర్‌గా నిధి మీనా, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ఎం.వికాశ్, పాడేరు సబ్‌కలెక్టర్‌గా వి.అభిషేక్, పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా ఎన్.నవీన్,నర్సాపురం సబ్‌కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా అపరాజిత సింగ్, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా కొట్ట సింహాచలం, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా భావన, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా సి.బాజ్పాల్ ను నియమించారు. చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి -
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం
డెహ్రాడూన్: తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ అకాడెమీలో నకిలీ ఐడీ కార్డు సాయంతో ఐఏఎస్ ట్రెయినీగా ప్రవేశించినట్టు ఆరోపణలు న్న మహిళ హెచ్చరించింది. యూపీకి చెందిన రూబీ చౌదరి అనే మహిళ నకిలీ ఐడీ కార్డు సాయంతో ఈ అకాడెమీలో ఐఏఎస్ ట్రెయినీగా ప్రవేశించడమేగాక.. 6 నెలలు అందులో కొనసాగిన వ్యవహారం తెలిసిందే. తనకు అకాడెమీ డిప్యూటీ డెరైక్టర్ అయిన సౌరభ్ జైన్ నకిలీ ఐడీ కార్డు ఇచ్చారని ఆరోపించిన ఆమె.. ఈ విషయంలో తప్పు చేయకుంటే ఆయన ధైర్యంగా బయటకు రావాలని సవాలు విసిరింది. అకాడెమీలో ఉద్యోగం కల్పించేందుకు రూ.20 లక్షలు చెల్లించేందుకు జైన్‌తో బేరం కుదిరిందని, అందులో ఇప్పటివరకు రూ.5 లక్షలు చెల్లించినట్టు వివరించింది. కాగా, జైన్‌కు అకాడమీ క్లీన్ చిట్ ఇచ్చింది. అకాడమీలో గార్డుకు కేటాయించిన గదిలో రూబియా ఉన్నట్లు తెలిసింది. -
ట్రైనీ ఐఏఎస్ జీవితం విషాదాంతం
ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న కల సాకారమైంది. భారత అత్యున్నత సర్వీస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి. ఇంతలోనే అతణ్ని మృత్యువు కబళించింది. తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన ఓ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ జీవితం విషాదాంతంగా ముగిసింది. పంజాబ్‌తో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి నిషాత్ కుమార్ మరణించారు. మోగా జిల్లాలో హైవేపై నిషాత్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. నిషాత్ స్వరాష్ట్రం బీహార్. గాయపడ్డ ఇతర అధికారుల్ని చికిత్స నిమిత్తం మోగా, లుధియానా ఆస్పత్రులకు తరలించారు.