ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న కల సాకారమైంది. భారత అత్యున్నత సర్వీస్కు ఎంపికయ్యారు. శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి. ఇంతలోనే అతణ్ని మృత్యువు కబళించింది. తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన ఓ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ జీవితం విషాదాంతంగా ముగిసింది.
పంజాబ్తో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి నిషాత్ కుమార్ మరణించారు. మోగా జిల్లాలో హైవేపై నిషాత్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. నిషాత్ స్వరాష్ట్రం బీహార్. గాయపడ్డ ఇతర అధికారుల్ని చికిత్స నిమిత్తం మోగా, లుధియానా ఆస్పత్రులకు తరలించారు.
ట్రైనీ ఐఏఎస్ జీవితం విషాదాంతం
Published Wed, Nov 6 2013 4:33 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement