న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం
డెహ్రాడూన్: తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ అకాడెమీలో నకిలీ ఐడీ కార్డు సాయంతో ఐఏఎస్ ట్రెయినీగా ప్రవేశించినట్టు ఆరోపణలు న్న మహిళ హెచ్చరించింది. యూపీకి చెందిన రూబీ చౌదరి అనే మహిళ నకిలీ ఐడీ కార్డు సాయంతో ఈ అకాడెమీలో ఐఏఎస్ ట్రెయినీగా ప్రవేశించడమేగాక.. 6 నెలలు అందులో కొనసాగిన వ్యవహారం తెలిసిందే. తనకు అకాడెమీ డిప్యూటీ డెరైక్టర్ అయిన సౌరభ్ జైన్ నకిలీ ఐడీ కార్డు ఇచ్చారని ఆరోపించిన ఆమె.. ఈ విషయంలో తప్పు చేయకుంటే ఆయన ధైర్యంగా బయటకు రావాలని సవాలు విసిరింది. అకాడెమీలో ఉద్యోగం కల్పించేందుకు రూ.20 లక్షలు చెల్లించేందుకు జైన్‌తో బేరం కుదిరిందని, అందులో ఇప్పటివరకు రూ.5 లక్షలు చెల్లించినట్టు వివరించింది. కాగా, జైన్‌కు అకాడమీ క్లీన్ చిట్ ఇచ్చింది. అకాడమీలో గార్డుకు కేటాయించిన గదిలో రూబియా ఉన్నట్లు తెలిసింది.