ముంబై: దేశంలోనే వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పూణే కలెక్టరేట్‌లో ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు దిలీప్ ఖేద్కర్‌పై నమోదైంది.
వివరాల ప్రకారం.. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చిన సమయంలో ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ హంగామా క్రియేట్ చేశారు. పూణేలోకి కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. అక్కడి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆఫీసులో ఉన్న సిబ్బందిని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తన కూతరు పూజా ఖేద్కర్‌కు క్యాబిన్ కేటాయించాలని డిమాండ్ చేసినట్టు కలెక్టరేట్‌కు చెందిన తహసీల్దార్ దీపక్ అకాడే తెలిపారు. ఇక, ఈ విషయమై అకాడే పోలీసులకు దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Maharashtra | A case has been registered against Dilip Khedkar - father of former IAS trainee officer Puja Khedkar under IPC sections 186, 504 and 506 at Bundgarden Police station last night: DCP Smarthna Patil, Pune Police
While Puja Khedkar was posted at the Pune Collector's…— ANI (@ANI) August 9, 2024
మరోవైపు.. ఇప్పటికే పూజా ఖేద్కర్ పేరెంట్స్ పలు వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఓ భూవివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని గన్‌తో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెపైనా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తాజాగా ఆమె తండ్రిపై కేసు నమోదైంది.
ఇదిలా ఉండగా.. పూణే ఖేద్కర్ ఎపిసోడ్‌లో తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందినట్టు తేలడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ ఎంపికను రద్దు చేసిన విషయం విధితమే.
Comments
Please login to add a commentAdd a comment