పాట పాడి స్టెప్పులేసిన లెజెండరీ సింగర్
జార్జియా: స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్‌లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు.
లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్‌కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.
శుభాకాంక్షల వెల్లువ
ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment