సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయంగా ప్రతిరోజూ ఓ అరగంట పాటు పాటలు పాడుతున్నారు. ఇన్‌స్టా లైవ్‌లో ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ తన గానామృతంతో కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్ పొందుతున్నామని అంటున్నారని, అందుకే ప్రతిరోజూ లైవ్‌కి వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పారు.
మదర్స్ డే సందర్భంగా ఓ పాట పాడమని నెటిజన్ అడగ్గా అమ్మ అనగానే కంట్లోంచి నీళ్లు వస్తాయని, ఈ లోకంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ అని చెబుతూ సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్స్‌లో ఎంతోమందిని వైద్య సిబ్బంది బిడ్డలా చూసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సునీత పాటలు పాడుతుండగానే మరో నెటిజన్..వాట్సాప్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీనికి సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. తాను కూడా కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అత్యవసరం అయితే తప్పా ఎవరూ బయట తిరగొద్దని సూచించారు.
చదవండి : ఆ డైరెక్టర్ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత
యాంకర్ శ్యామల, క్రికెటర్ భువనేశ్వర్ అక్కాతమ్ముళ్లా?
Comments
Please login to add a commentAdd a comment