బుల్లితెరపై నాగబాబు హవా ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా కొన్ని షోలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి అంతంగా సక్సెస్ కాలేదు. దీంతో యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఇప్పటికే పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు..ప్రస్తుతం ఖుషీఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోకు జడ్జిగా ఉంటున్నారు. ఈ షో ద్వారా నాగబాబు తన సొంత యూట్యూబ్ చానెల్‌తో కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వీటికి వ్యూస్ రావడం లేదు. అంతేకాకుండా ఈ షోలో శృతిమించిన కామెడీ ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన నాగబాబుకు ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'ఖుషీ ఖుషీగా షో చూస్తున్నంతసేపు అసలు టైం తెలియదు..అప్పుడే ఫైనల్ వరకు వచ్చేసిందా.? అని పేర్కొనగా..దీనికి నాగబాబు స్పందిస్తూ..మీరు ఇప్పుడు ఇలానే అంటారు..చూసి షేర్ మాత్రం చేయరు..వ్యూస్ ఎక్కడ అండి వ్యూస్ అంటూ సెటైరికల్‌గా ఆన్సర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి : రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్
ప్రపంచంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక సినిమా అదే!
Comments
Please login to add a commentAdd a comment