లైవ్‌లో నటుడి చెంప చెళ్లుమనిపించింది | Shehnaaz Gill Slaps Sidharth Shukla During Live Session | Sakshi
Sakshi News home page

సీరియస్‌గా కాదు.. ట్రోల్స్‌కు ఇలానే సమాధానం చెప్పండి

Published Mon, Aug 3 2020 7:16 PM | Last Updated on Mon, Aug 3 2020 7:25 PM

Shehnaaz Gill Slaps Sidharth Shukla During Live Session - Sakshi

హిందీ నటులు షెహనాజ్ గిల్-సిధార్థ్ శుక్లా.. బిగ్‌బాస్-13తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఇద్ద‌రు తార‌లు.. తాజాగా అభిమానుల‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సిద్‌నాజ్’‌ పేరుతో లైవ్ సెష‌న్‌ నిర్వహించారు. సిద్‌నాజ్‌కు ఉన్న అభిమానుల గురించి మాట్లాడారు. ఈ వీడియోలో సిధార్థ్‌ లైవ్‌లో తమను ప్రత్యక్షంగా చూస్తోన్న అభిమానులను ఉద్దేశిస్తూ..  ‘చూడండి మేం ఇద్దరం కలిసే ఉన్నాం. మరి మీరు దేని గురించి గొడవ పడుతున్నారు.. ఆందోళన చెందుతున్నారు’ అని అడిగారు. అంతేకాక కొందరు కావాలనే ద్వేషాన్ని ప్రచారం చేస్తారని.. అలాంటి వారిని పట్టించుకోవద్దని కోరారు. సిధార్థ్‌ ఇలా మాట్లాడుతుండగా అతని ప‌క్క‌నే ఉన్న షెహ్‌నాజ్ అతడి చెంప మీద కొట్టింది. వెంటనే అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘సీరియస్‌గా కాదు. ట్రోల్‌ చేసేవారికి మీరు ఇలానే సమాధానం చెప్పండి’ అన్నది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. (చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్‌)

షెహ్‌నాజ్‌-సిధార్థ్ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే వీళ్లు వివాహ బంధంతో ఒక్క‌ట‌వ్వ‌నున్నార‌ని ఇప్ప‌టికే చాలా కాలంగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. షెహ్‌నాజ్ త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచినా.. సిధార్థ్ మాత్రం తాము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement