Siddharth Confirms His Relationship With Rumoured Girlfriend Aditi Rao Hydari - Sakshi
Sakshi News home page

Siddharth-Aditi Rao Hydari: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్‌.. తొలిసారి నోరు విప్పిన సిద్ధార్థ్!

Published Sat, Jun 10 2023 6:52 PM | Last Updated on Sat, Jun 10 2023 7:44 PM

Siddharth Confirm His Relationship With Rumoured Girlfriend Aditi Rao Hydari - Sakshi

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్‌. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది.

(ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..)

చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్‌.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్‌లో ఉ‍న్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. 

గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్‌లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్‌లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్‌ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్‌ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్‌ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్‌పై ఈ జంట స్పందించలేదు. 

కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి.

(ఇది చదవండి: శర్వానంద్‌ పెళ్లికి హాజరైన లవ్‌ బర్డ్స్‌.. సోషల్ మీడియాలో వైరల్!)
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement