ఢిల్లీ : టీమిండియాలో నాలుగోస్థానంపై ఎలాంటి అనుమానాలక్కర్లేదని, ఎందుకంటే ఆ స్థానం తనదేనంటూ భారత యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. సోమవారం ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ షోలో శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చర్చించాడు.
'భారత్ తరఫున ఏడాదిగా ఒక స్థానంలో స్థిరంగా ఆడుతున్నామంటే.. ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నట్లే. దాని గురించి ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నాలుగో నంబరు గురించి చర్చ నడిచినప్పుడు ఆ స్థానంలో దిగి నన్ను నేను నిరూపించుకోవడం సంతృప్తిగా ఉంది. కానీ టీమిండియాకు ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి.. పరిస్థితిని బట్టి ఏ స్థానంలోనైనా ఆడగలను' అని అయ్యర్ తెలిపాడు. గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు అంతకుముందు వెస్టిండీస్ సిరీస్‌లోనూ అయ్యర్ అంచనాలకు మించి రాణించాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో ఓ సెంచరీ సహా రెండు అర్ధ సెంచరీలతో 217 పరుగులు సాధించాడు. కాగా 25 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ 18 వన్డేల్లో 748 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు ఉన్నాయి.
బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌గా
Comments
Please login to add a commentAdd a comment