టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ఆసియా కప్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌సీఏ అకాడమీలో ఉన్న ఈ ఇద్దరు ఫిట్‌నెస్ నిరూపించుకునే పనిలో ఉన్నారు. అయితే ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్‌లో టీమిండియా తరపున వీరిద్దరు ఆడేది అనుమానంగానే ఉంది. అనుకున్నంత వేగంగా రికవరీ కాలేదని.. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు మరో నాలుగు వారాలు పట్టే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు తరచూ తమ ప్రాక్టీస్ వీడియోలనూ షేర్ చేస్తున్నారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికి వారికి తగినంత విశ్రాంతి అవసరమనిపిస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించకముందే వారిద్దరిని ఆసియా కప్ ఆడించలేమని.. వన్డే వరల్డ్‌కప్ దృశ్యా అంత రిస్క్ చేయలేమని.. అది జట్టుకు కీడు చేసే అవకాశముందని బీసీసీఐ పేర్కొంది. కాగా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌కు రాహుల్, అయ్యర్‌లు పూర్తి స్థాయిలో సన్నద్దమయితే సెప్టెంబర్‌లో ఆసీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ ఈ ఇద్దరికి కమ్‌బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లకు ఆసియా కప్ మంచి అవకాశమని చెప్పొచ్చు. వరల్డ్‌కప్‌కు ముందు ఆసియా కప్ జరగనుండడంతో టీమిండియా కూడా పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇక బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలు ప్రధాన బౌలర్లుగా వ్యవహరించే అవకాశముంది.
అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, శ్రీలంక లాంటి బలమైన జట్లతో ఆడాల్సి ఉంది. ఇక ఆసియా కప్ హైబ్రీడ్ విధానంలో జరగనుంది. మొత్తం ఆరు జట్లు రెండు గ్రూపులుగా విడిపోయాయి. భారత్, పాకిస్తాన్, నేపాల్ ఒక గ్రూపులో.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు మరొక గ్రూపులో ఉన్నాయి. పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు.. శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 2న కొలంబో వేదికగా ఆడనుంది.
KL Rahul and Shreyas Iyer unlikely to be picked for Asia Cup 2023. (Cricbuzz). pic.twitter.com/2VNgXhkO9u
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2023
చదవండి: BCCI: భారీ ఆదాయంపై కన్ను.. మీడియా హక్కుల టెండర్లు విడుదల
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్.. అదరగొట్టిన ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment