IPL 2025: ధోని మెరుపులు.. ల‌క్నోపై సీఎస్‌కే విజ‌యం | IPL 2025: Lucknow Super Giants Vs Chennai Super Kings, 30th Match - Live Cricket Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: ధోని మెరుపులు.. ల‌క్నోపై సీఎస్‌కే విజ‌యం

Published Mon, Apr 14 2025 7:21 PM | Last Updated on Mon, Apr 14 2025 11:42 PM

IPL 2025: Lucknow super giants vs chennai super kings live updates and highlights

PC: BCCI/IPL.com

LSG vs CSK Live Updates: 

సీఎస్‌కే ఘ‌న విజ‌యం
ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎట్ట‌కేల‌కు తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. ఎక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీల‌క పాత్ర పోషించాడు. 

ధోని కేవ‌లం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు శివ‌మ్ దూబే(43 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫ‌లితంగా 167 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవ‌ర్ల‌లో చేధించింది. 

18 ఓవ‌ర్ల‌కు స్కోర్‌: 143/5
18 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 5 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. క్రీజులో శివ‌మ్ దూబే(26), ధోని(20) ఉన్నారు. 

16 ఓవ‌ర్ల‌కు సీఎస్‌కే స్కోర్‌: 127/5
16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 5 వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో శివ‌మ్ దూబే(19), ధోని(9) ఉన్నారు. సీఎస్‌కే విజ‌యానికి 24 బంతుల్లో 44 ప‌రుగులు కావాలి.

సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్‌..
జ‌డేజా రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జ‌డేజా.. ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది.

ర‌వీంద్ర ఔట్‌..
ర‌చిన్ ర‌వీంద్ర రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన ర‌చిన్ ర‌వీంద్ర‌.. మార్‌క్ర‌మ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 74 ప‌రుగులు చేసింది.

సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌..
షేక్ ర‌షీద్ రూపంలో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 27 ప‌రుగులు చేసిన షేక్ ర‌షీద్‌.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవ‌ర్లకు సీఎస్‌కే వికెట్ న‌ష్టానికి 59 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌వీంద్ర‌(25), రాహుల్ త్రిపాఠి(5) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న సీఎస్‌కే
167 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే దూకుడుగా ఆడుతోంది. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి చెన్నై వికెట్ న‌ష్ట‌పోకుండా 37 ప‌రుగులు చేసింది. క్రీజులో షేక్ ర‌షీద్‌(22), రచిన్ ర‌వీంద్ర (15) ఉన్నారు.

రిష‌బ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. సీఎస్‌కే టార్గెట్ ఎంతంటే?
ఎక్నా స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. రిష‌బ్ పంత్ మాత్రం కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 63 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు మార్ష్‌(30), బ‌దోని(22) రాణించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా,ప‌తిరానా త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. ఖాలీల్ అహ్మ‌ద్‌, కాంబోజ్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.
రిష‌బ్ పంత్ హాఫ్ సెంచరీ..
రిష‌బ్ పంత్ ఎట్ట‌కేల‌కు ఫామ్‌లోకి వ‌చ్చాడు. ల‌క్నో వేదిక‌గా సీఎస్‌కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంత్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 55 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 18 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో నాలుగు వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు చేసింది.
ల‌క్నో మూడో వికెట్ డౌన్‌..
మిచెల్ మార్ష్ రూపంలో ల‌క్నో మూడో వికెట్ కోల్పోయింది. 30 ప‌రుగులు చేసిన మార్ష్‌.. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో  మూడు వికెట్ల న‌ష్టానికి 95 ప‌రుగులు చేసింది. క్రీజులో రిష‌బ్ పంత్‌(29), బ‌దోని(20) ఉన్నారు.

ల‌క్నో రెండో వికెట్ డౌన్‌..
నికోల‌స్ పూర‌న్ రూపంలో ల‌క్నో రెండో వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన పూర‌న్‌.. కాంబోజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 6 ఓవ‌ర్లు ముగిసే సరికి రెండు వికెట్లు 42 ప‌రుగులు చేసింది. క్రీజులో పంత్‌(6), మార్ష్‌(22) ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నోకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. 6 ప‌రుగులు చేసిన మార్‌క్ర‌మ్‌.. ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 12 ప‌రుగులు చేసింది.

ఐపీఎల్‌-2025లో ఎక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు డెవాన్ కాన్వే, అశ్విన్ దూర‌మ‌య్యారు. వారిద్ద‌రి స్ధానంలో షేక్ రషీద్, ఓవ‌ర్ట‌న్ వ‌చ్చారు.

తుది జ‌ట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్‌), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement