ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను రిలీజ్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ రాహుల్ స్ట్రయిక్‌రేట్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనకు రాహుల్ స్ట్రయిక్ రేట్ ప్రధాన కారణమని మేనేజ్‌మెంట్ భావిస్తుందట.
రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్సీ పగ్గాలు నికోలస్ పూరన్‌కు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం పూరన్‌తో పాటు మరో ఇద్దరిని రిటైన్ చేసుకోనుందని సమాచారం. రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్‌ల కోసం భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మయాంక్‌కు పారితోషికం కింద దాదాపు రూ. 14 కోట్లు దక్కవచ్చని అంచనా. అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోటాలో ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను కూడా రిటైన్ చేసుకోనున్నట్లు సమాచారం.
కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూడు సీజన్ల పాటు కేఎల్ రాహుల్ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో.. ఈ ఏడాది లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది.
చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు
Comments
Please login to add a commentAdd a comment