వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విజృంభించి నెదర్లాండ్స్‌ను 160 పరుగుల భారీ తేడాతో ఓడించారు. భారత గెలుపులో రాహుల్, శ్రేయస్ ప్రధానపాత్ర పోషించారు.
ఈ జోడీ నాలుగో వికెట్‌కు అభేద్యమైన 208 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. ఈ క్రమంలో రాహుల్-శ్రేయస్ జోడీ వరల్డ్‌కప్ రికార్డు నెలక్పొంది. వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున నాలుగు అంతకంటే తక్కువ వికెట్లకు నమోదైన భాగస్వామ్యాల్లో ఇదే అత్యుత్తమంగా నిలిచింది. దీనికి ముందు 2015 వరల్డ్‌కప్‌లో ధోని, రైనా జోడీ జింబాబ్వేపై నెలకొల్పిన అజేయ 196 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉండింది.
ఇదే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌పై విరాట్-రాహుల్ జోడీ నెలకొల్పిన 165 పరుగుల భాగస్వామ్యం ఈ విభాగంలో మూడో అత్యుత్తమంగా ఉంది. ఆతర్వాత 1996 వరల్డ్‌కప్‌లో కాంబ్లీ-సిద్దూ నెలకొల్పిన 142 పరుగుల భాగస్వామ్యం.. 1999 వరల్డ్‌కప్‌లో అజయ్ జడేజా, రాబిన్ సింగ్ నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యం వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా నెదర్లాండ్స్‌పై కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి దోహదపడిన రాహుల్-శ్రేయస్ జోడీ నంబర్ వన్ జోడీ అనిపించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment