Bigg Boss 5 Telugu, Deepthi Sunania: బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడికి వెళ్లినా అతడి ప్రియురాలు దీప్తి సునయన గురించే ఆరా తీశారు అభిమానులు. ఎప్పుడు కలుస్తారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఇద్దరూ కలిసి ఏవైనా సాంగ్స్ తీస్తున్నారా? అని వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి షణ్నూ త్వరలోనే దీపూను కలుస్తానని అప్పటిదాకా వెయిట్ చేయండని చెప్పాడు. కానీ న్యూ ఇయర్ రోజు ఈ జంట తమ ఐదేళ్ల రిలేషన్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు పెద్ద షాకిచ్చారు.
బ్రేకప్ తర్వాత దీప్తి సునయన తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. ఇకపై నా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను' అని చెప్తూ దీప్తి తన కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment