తల్లి పాత్రలు చాలా సులభం: శ్రియ | Playing a mother on-screen was easy, says Shriya | Sakshi
Sakshi News home page

తల్లి పాత్రలు చాలా సులభం: శ్రియ

Published Fri, Jul 10 2015 6:38 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

తల్లి పాత్రలు చాలా సులభం: శ్రియ

తల్లి పాత్రలు చాలా సులభం: శ్రియ

వెండితెర మీద తల్లి పాత్రలు పోషించడం పెద్ద కష్టం ఏమీ కాదని హీరోయిన్ శ్రియాశరణ్ చెప్పింది. 'దృశ్యం' సినిమా హిందీ రీమేక్లో అజయ్ దేవ్గణ్ సరసన శ్రియ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అక్కడ నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లకు తల్లిగా తెలుగులో మీనా పోషించిన పాత్రను హిందీలో శ్రియ పోషిస్తోంది. తల్లి పాత్ర పోషించడం పెద్ద కష్టమేమీ కాదని, అది చాలా ఆసక్తికరమైన పాత్ర అని తెలిపింది.

ఈ సినిమాతో ఎవరైనా కనెక్ట్ అయిపోతారని, ఇందులోని పాత్రలు, సందర్భాలు.. అన్నీ చాలా బాగుంటాయని శ్రియ చెప్పింది. హిందీ దృశ్యం ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. అజయ్ దేవ్గణ్కు తాను పెద్ద అభిమానినని, ఆయనను ఆరాధించానని తెలిపింది. ఆయనతో నటించడం చాలా సులభంగా ఉంటుందని, ఇక టబు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. హిందీ దృశ్యం సినిమా ఈనెల 31న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement