తల్లిపాత్రే అన్నింటికంటే టాప్: శిల్పాశెట్టి | Being a mother is closest to me, says Shilpa Shetty | Sakshi
Sakshi News home page

తల్లిపాత్రే అన్నింటికంటే టాప్: శిల్పాశెట్టి

Published Fri, Jan 31 2014 12:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

తల్లిపాత్రే అన్నింటికంటే టాప్: శిల్పాశెట్టి

తల్లిపాత్రే అన్నింటికంటే టాప్: శిల్పాశెట్టి

రెండు దశాబ్దాల పాటు ఆమె వెండితెరమీద ఓ వెలుగు వెలిగింది. లెక్కలేనన్ని పాత్రలు చేసింది. కానీ అన్నింటికంటే తల్లిపాత్రలో ఒదిగిపోవడమే తనకు బాగా నచ్చిందని చెబుతోంది శిల్పాశెట్టి. ఏడాదిన్నర వయసున్న తన కొడుకు వియాన్తో ఉంటే అసలు ప్రపంచమే పట్టడంలేదని అంటోందీ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతం ఓ టీవీ చానల్లో దర్శకుడు సాజిద్ ఖాన్, కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్తో కలిసి 'నచ్ బలియే 6' రియాల్టీ షోకు హోస్ట్గా శిల్పాశెట్టి వ్యవహరిస్తోంది. షూటింగులో ఉన్నా కూడా తనకెప్పుడూ కొడుకు ధ్యాసే ఉంటోందని ఆమె చెబుతోంది.

2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన తర్వాత ఆమె చేస్తున్న ఈ రియాల్టీ షో దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు తనకు వియన్తో చేతినిండా పని ఉంటోందని, ఈ షో పూర్తయ్యాక ఇక వాడికే సమయం మొత్తం అంకితం చేస్తానని అంటోంది. బాజీగర్, రిష్తే లాంటి హిందీ సినిమాలతో పాటు.. మోహన్ బాబుతో వీడెవడండీ బాబూ, వెంకటేష్తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో ఆజాద్ లాంటి తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి మెరిసింది. ప్రేక్షకుల గుండెల్లో తనకెప్పుడూ సుస్థిరమైన స్థానం ఉంటుందని ఆమె అంటోంది. మొత్తానికి తల్లిపాత్రను పూర్తిస్థాయిలో పోషించడమే అన్నింటికంటే ఇష్టమని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement