nach baliye
-
చెప్పుకోలేను, అలాగని సర్దుకుపోలేను: బ్రేకప్ చెప్పిన బుల్లితెర నటి
Palak Purswani Breakup With Avinash Sachdev: సంక్రాంతి పండగ పూట విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చిందో బుల్లితెర జంట. పెళ్లి చేసుకుని ఒకటవుదామనుకున్న పాలక్ పురస్వాని, అభినవ్ సచ్దేవ్ తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని పాలక్ జాతీయ మీడియాకు వెల్లడించింది. 'ప్రతి బంధంలోను ఎత్తుపల్లాలు ఉంటాయి. సమస్యలూ ఉంటాయి, అవన్నీ సర్వసాధారణం. అయితే కొన్ని విషయాలు మాత్రం బయటకు చెప్పుకోలేము, అలాగని సర్దుకుపోలేము. నా విషయానికి వస్తే జీవితంలో ప్రేమ కన్నా నిజాయితీ, గౌరవమే నాకు ముఖ్యమైనవి' అని చెప్పుకొచ్చింది. 'మేము నాలుగేళ్లు కలిసి ప్రయాణించాము. ఆ జర్నీ మీదున్న గౌరవంతో అన్ని విషయాలు చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుతం నేను బాగున్నాను. అతడు నాకు సారీ చెప్పకపోయినప్పటికీ నేను మాత్రం అతడిని క్షమించాను. నేనిక నన్ను నేను ప్రేమించడంపైనే దష్టి పెడతాను. నా ఫ్యామిలీని చూసుకోవడంతోపాటు నా కెరీర్‌పై ఫోకస్ పెడతాను' అని పేర్కొంది. కాగా గతేడాది జనవరిలో రోకా ఫంక్షన్ జరుపుకున్న పాలక్, అభినవ్‌లు కరోనా వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాదైనా పెళ్లి పీటలెక్కుతారేమోనని ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా బ్రేకప్ చెప్పుకోవడం గమనార్హం. వీళ్లిద్దరూ 'నాచ్ బలియే' తొమ్మిదవ సీజన్లో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by 𝐏𝐚𝐥𝐚𝐤 𝐏𝐮𝐫𝐬𝐰𝐚𝐧𝐢 (@palak.purswani) -
అందుకే మేం విడిపోయాం: నటి
ప్రియుడు శంతను మహేశ్వరితో తన ప్రేమబంధం ముగిసిపోయిందని నటి నిత్యామీ శ్రికే తెలిపారు. ప్రేమికులుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా ఎల్లప్పుడూ కలిసే ఉంటామని స్పష్టం చేశారు. కాగా పలు టీవీ షోల్లో మెరిసిన నిత్యామీ.. నటుడు శంతనుతో కలిసి మెడికల్లీ యువర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఇక డాన్స్ రియాలిటీ షో నచ్ బలియే 9లో జంటగా పాల్గొన్న వీరిద్దరు అదే స్టేజ్‌పై తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఏడాది తిరగకుండానే తమ మధ్య బంధం ముగిసినట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ విషయం గురించి నిత్యామీ మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్ 2019లో ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో శంతనును కలిశాను. అందులో మేమిద్దరం జంటగా నటించాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. (మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్) ఇక నచ్ బలియే షో కారణంగా దాదాపు ఐదు నెలల పాటు ఒకేచోట ఉండాల్సి వచ్చింది. అలా మా బంధం మొదలైంది. ఇప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే మేం స్నేహితులుగా మాత్రమే కలసి ఉండగలమనే అభిప్రాయానికి వచ్చాం. అందుకే ఫిబ్రవరిలో బ్రేకప్ చెప్పుకొన్నాం. ఏదేమైనా మంచి స్నేహితుడిగా శంతనుకు నా జీవితంలో ఎల్లప్పుడూ స్థానం ఉంటుంది’’అని చెప్పుకొచ్చారు. కాగా ప్రేమలో విఫలమైన నిత్యామీ తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు మెల్బోర్న్ వెళ్లిపోయారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక శంతను నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్, హోస్ట్‌గా అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. (తన పెళ్లి వార్తలపై స్పందించిన సాయి పల్లవి) -
శిఖర్ ధావన్ డాన్స్?
ముంబై: మైదానంలో బ్యాటుతో విరుచుకుపడే టీమిండియా బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ డాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తన భార్య అయేషాతో కలిసి డాన్స్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. స్టార్ ప్లస్ సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో 'నచ్ బలియే 7' వైల్డ్ కార్డ్ ఎంట్రీతో థ్రిల్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. స్పెషల్ వెల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలో పాల్గొనాలని ధావన్, అయేషా దంపతులను సంప్రదించినట్టు షో నిర్వాహకులు వెల్లడించారు. వీరిద్దరూ డాన్స్ చేస్తే అదనపు ఆకర్షణ అవుతుందని పేర్కొన్నారు. 'నచ్ బలియే 7' రియాలిటీ షోను ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. ఈసారి పోటీదారులందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ప్రేక్షకులకు ఓటింగ్ చేసే అవకాశం లేదు. నటి ప్రీతి జింతా, రచయిత చేతన్ భగత్, కొరియోగ్రాఫర్ మార్జి పెస్టోన్జీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. -
తల్లిపాత్రే అన్నింటికంటే టాప్: శిల్పాశెట్టి
రెండు దశాబ్దాల పాటు ఆమె వెండితెరమీద ఓ వెలుగు వెలిగింది. లెక్కలేనన్ని పాత్రలు చేసింది. కానీ అన్నింటికంటే తల్లిపాత్రలో ఒదిగిపోవడమే తనకు బాగా నచ్చిందని చెబుతోంది శిల్పాశెట్టి. ఏడాదిన్నర వయసున్న తన కొడుకు వియాన్‌తో ఉంటే అసలు ప్రపంచమే పట్టడంలేదని అంటోందీ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతం ఓ టీవీ చానల్లో దర్శకుడు సాజిద్ ఖాన్, కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్‌తో కలిసి 'నచ్ బలియే 6' రియాల్టీ షోకు హోస్ట్‌గా శిల్పాశెట్టి వ్యవహరిస్తోంది. షూటింగులో ఉన్నా కూడా తనకెప్పుడూ కొడుకు ధ్యాసే ఉంటోందని ఆమె చెబుతోంది. 2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన తర్వాత ఆమె చేస్తున్న ఈ రియాల్టీ షో దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు తనకు వియన్తో చేతినిండా పని ఉంటోందని, ఈ షో పూర్తయ్యాక ఇక వాడికే సమయం మొత్తం అంకితం చేస్తానని అంటోంది. బాజీగర్, రిష్తే లాంటి హిందీ సినిమాలతో పాటు.. మోహన్ బాబుతో వీడెవడండీ బాబూ, వెంకటేష్‌తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో ఆజాద్ లాంటి తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి మెరిసింది. ప్రేక్షకుల గుండెల్లో తనకెప్పుడూ సుస్థిరమైన స్థానం ఉంటుందని ఆమె అంటోంది. మొత్తానికి తల్లిపాత్రను పూర్తిస్థాయిలో పోషించడమే అన్నింటికంటే ఇష్టమని చెబుతోంది.