
అతడు నాకు సారీ చెప్పకపోయినప్పటికీ నేను మాత్రం అతడిని క్షమించాను. కొన్ని విషయాలు మాత్రం బయటకు చెప్పుకోలేము, అలాగని సర్దుకుపోలేము...
Palak Purswani Breakup With Avinash Sachdev: సంక్రాంతి పండగ పూట విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చిందో బుల్లితెర జంట. పెళ్లి చేసుకుని ఒకటవుదామనుకున్న పాలక్ పురస్వాని, అభినవ్ సచ్‌దేవ్ తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని పాలక్ జాతీయ మీడియాకు వెల్లడించింది. 'ప్రతి బంధంలోను ఎత్తుపల్లాలు ఉంటాయి. సమస్యలూ ఉంటాయి, అవన్నీ సర్వసాధారణం. అయితే కొన్ని విషయాలు మాత్రం బయటకు చెప్పుకోలేము, అలాగని సర్దుకుపోలేము. నా విషయానికి వస్తే జీవితంలో ప్రేమ కన్నా నిజాయితీ, గౌరవమే నాకు ముఖ్యమైనవి' అని చెప్పుకొచ్చింది.
'మేము నాలుగేళ్లు కలిసి ప్రయాణించాము. ఆ జర్నీ మీదున్న గౌరవంతో అన్ని విషయాలు చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుతం నేను బాగున్నాను. అతడు నాకు సారీ చెప్పకపోయినప్పటికీ నేను మాత్రం అతడిని క్షమించాను. నేనిక నన్ను నేను ప్రేమించడంపైనే దష్టి పెడతాను. నా ఫ్యామిలీని చూసుకోవడంతోపాటు నా కెరీర్‌పై ఫోకస్ పెడతాను' అని పేర్కొంది. కాగా గతేడాది జనవరిలో రోకా ఫంక్షన్ జరుపుకున్న పాలక్, అభినవ్‌లు కరోనా వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాదైనా పెళ్లి పీటలెక్కుతారేమోనని ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా బ్రేకప్ చెప్పుకోవడం గమనార్హం. వీళ్లిద్దరూ 'నాచ్ బలియే' తొమ్మిదవ సీజన్‌లో పాల్గొన్నారు.