శిఖర్ ధావన్ డాన్స్? | Shikhar Dhawan to enter 'Nach Baliye 7' as wild card? | Sakshi
Sakshi News home page

శిఖర్ ధావన్ డాన్స్?

Published Thu, May 21 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

శిఖర్ ధావన్ డాన్స్?

శిఖర్ ధావన్ డాన్స్?

ముంబై: మైదానంలో బ్యాటుతో విరుచుకుపడే టీమిండియా బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ డాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తన భార్య అయేషాతో కలిసి డాన్స్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. స్టార్ ప్లస్ సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో 'నచ్ బలియే 7' వైల్డ్ కార్డ్ ఎంట్రీతో థ్రిల్ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు.

స్పెషల్ వెల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలో పాల్గొనాలని ధావన్, అయేషా దంపతులను సంప్రదించినట్టు షో నిర్వాహకులు వెల్లడించారు. వీరిద్దరూ డాన్స్ చేస్తే అదనపు ఆకర్షణ అవుతుందని పేర్కొన్నారు. 'నచ్ బలియే 7' రియాలిటీ షోను ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. ఈసారి పోటీదారులందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ప్రేక్షకులకు ఓటింగ్ చేసే అవకాశం లేదు. నటి ప్రీతి జింతా, రచయిత చేతన్ భగత్, కొరియోగ్రాఫర్ మార్జి పెస్టోన్జీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement