
క్రికెటర్లకు విశ్రాంతి అవసరమన్న ధావన్
దుబాయ్: భారత క్రికెటర్లకు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి చేయడం సరైన నిర్ణయమేనని మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్లేయర్లకు తగినంత విశ్రాంతి కూడా అవసరమనే అంశాన్ని విస్మరించరాదని కూడా అతను గుర్తు చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ సమతూకం పాటించాలని శిఖర్ చెప్పాడు. ‘ఇది చాలా చక్కటి నిర్ణయం. నా దృష్టిలో ప్రస్తుత క్రికెటర్లంతా దేశవాళీ మ్యాచ్‌లలో ఆడాలి. అప్పుడే ఆ మ్యాచ్‌లకు ఆకర్షణ వస్తుంది. కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే స్టేడియం ఎలా నిండిపోయిందో మనం చూశాం.
అయితే కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కూడా అవసరం. వారిపై అధిక భారం వేయరాదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధిత వ్యక్తులు పర్యవేక్షించాలి’ అని ధావన్ వ్యాఖ్యానించాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో 363 పరుగులతో శిఖర్ ధావన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోరీ్న’గా నిలిచాడు. తాజా టోర్నీ కోసం ఐసీసీ ఎంపిక చేసిన నలుగురు ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్లలలో అతను కూడా ఒకడు. గత ఏడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్... ఆటకు దూరమైనందుకు తాను ఏమాత్రం చింతించడం లేదని వెల్లడించాడు. ‘నేను చాలా బాగా ఉత్సాహంగా ఉన్నాను.
ఎలాంటి చింతా లేదు. ప్రస్తుతం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా ఆట గురించి నాకు బాగా తెలుసు. దేవుడు చాలా సుదీర్ఘ కెరీర్ ఇచ్చినందుకు కృతజ్ఞుడను’ అని స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఏకపక్షంగా మారిపోవడంపై కూడా అతను స్పందించాడు. ‘మ్యాచ్‌పై అంచనాలు, ఆసక్తి, మైదానంలో తీవ్రత అలాగే ఉన్నాయి. గతంలో వారు వరుసగా గెలిచేవారు. ఇప్పుడు మనం గెలుస్తున్నాం. అంతే తేడా ఉంది’ అని శిఖర్ విశ్లేíÙంచాడు. ప్రస్తుతం జట్టు వైస్ కెపె్టన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ ఆ హోదాకు అర్హుడని... మున్ముందు అతను కచ్చితంగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని ధావన్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment