తల్లి పాత్రలకు మరో హీరోయిన్ రెడీ | Shilpa Shetty open to play role of a mother in films | Sakshi
Sakshi News home page

తల్లి పాత్రలకు మరో హీరోయిన్ రెడీ

Published Tue, Aug 30 2016 5:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

తల్లి పాత్రలకు మరో హీరోయిన్ రెడీ

తల్లి పాత్రలకు మరో హీరోయిన్ రెడీ

ముంబై: ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు వెలిగిన చాలామంది హీరోయిన్లు నాలుగుపదుల వయసు వచ్చాక తల్లిపాత్రలు చేశారు. బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమాల్లో మెరిసిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి కూడా తల్లిపాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను నిజజీవితంలో తల్లినని, తల్లిపాత్రలో నటించేందుకు తనకు అభ్యంతరంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా 41 ఏళ్ల శిల్పాశెట్టి చెప్పింది.

వ్యాపారవేత్త రాజ్కుంద్రాను వివాహం చేసుకున్న తర్వాత శిల్పా భర్తకు తోడుగా వ్యాపారాలు చూసుకుంటోంది. ఆమె చివరిసారి 2008 దోస్తానా సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించింది. ఆ తర్వాత బిగ్ స్క్రీన్పై కనిపించలేదు. కాగా ప్రస్తుతం ఓ టీవీ డాన్స్ రియాల్టీ షో చేస్తోంది. వివాహం అయిన తర్వాత కూడా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు నటించారని, కరీనా కపూర్ గర్భవతిగా ఉన్న సినిమాలో నటిస్తోందని చెప్పింది. నిన్నటితరం నటి షర్మిలా ఠాగూర్ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా నటించి విజయవంతమయ్యారని, పెళ్లయిన హీరోయిన్లు నటనను కొనసాగించడం కొత్త ట్రెండ్ ఏమీకాదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement