శ్రీశాంత్‌కు అమ్మగా రమ్యక్రిష్ణ | Ramya Krishna to play Sreesanth's mother | Sakshi
Sakshi News home page

శ్రీశాంత్‌కు అమ్మగా రమ్యక్రిష్ణ

Published Mon, Sep 21 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

శ్రీశాంత్‌కు అమ్మగా రమ్యక్రిష్ణ

శ్రీశాంత్‌కు అమ్మగా రమ్యక్రిష్ణ

పడయప్పా (తెలుగులో నరసింహా) చిత్రానికి ముందు రమ్యక్రిష్ణ వేరు ఆ తరువాత రమ్యక్రిష్ణ వేరు. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు రమ్యక్రిష్ణ ఒక గ్లామర్ డాల్. పడయప్పా చిత్రంతో రమ్యక్రిష్ణ అభినేత్రిగానే కొనియాడబడ్డారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సెలక్టీవ్ చిత్రాలనే చేస్తున్న రమ్యక్రిష్ణ బాహుబలి చిత్రంలో శివకామి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. అలాంటి ఆ నట శిఖామణి తాజాగా అమ్మగా మరోసారి జీవించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. అదీ సంచలన క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు స్ఫూర్తిదాయకమైన అమ్మగా నటించనున్నారట.

ఆ మధ్య వివాదాలకు గురై జైలు జీవితాన్ని కూడా అనుభవించి ఇటీవల నిర్దోషిగా బయట కొచ్చిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్ సినీ రంగప్రవేశం గురించి కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆయన దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ రూపొందనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారట. దీనికి సానాయాది రెడ్డి దర్శకత్వం వహించనున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రైటర్ పని చేస్తున్న ప్రకాశ్ వివరాలను తెలుపుతూ ఇది క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు చెప్పారు. ఇందులో శ్రీశాంత్‌కు అమ్మగా రమ్యక్రిష్ణ పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement