మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ మహిళలతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఉమెన్ ఇన్ బ్లూ ఉవ్విళ్లూరుతోంది.
ఈ నేపథ్యంలో హర్మన్ సేనను ఉద్దేశించి భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసేకునేందుకు భారత్‌కు అన్ని విధాలగా అర్హత ఉందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.
వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన భారత జట్టు అద్బుతంగా ఉంది. టీమ్‌తో పాటు భారత్‌కు గొప్ప కోచింగ్ స్టాప్ ఉంది. ముఖ్యంగా హెడ్‌కోచ్ అమోల్ భాయ్ (ముజుందార్) కోసం ఎంత చెప్పకున్న తక్కవే. అతడొక అద్బుతమైన కోచ్. ఈ సారి అతడి నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకుంటున్నా.
కోచ్‌తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నేను చూశాను. తమ జట్టు 100 శాతం ఎఫెక్ట్ పెట్టి ఆడితే ఏ జట్టునైనా ఓడించగలదని ఆమె చెప్పుకొచ్చింది అంటూ శ్రీశాంత్ పేర్కొన్నాడు.
ఆ ఇద్దరే కీలకం..
ఈ టోర్నీలో భారత్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు ఎక్స్ ఫ్యాక్టర్స్(కీలక ఆటగాళ్లగా) మారనున్నారు.
హర్మన్ గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆమె 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన ఇన్నింగ్స్ మళ్లీ ఈసారి చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను.
ఆమె ఈ సారి ఏదో మ్యాజిక్‌తో ముందుకు వస్తుందని నమ్మకం నాకు ఉంది. మరోవైపు స్మృతి మంధాన కూడా సత్తాచాటనుంది. అదేవిధంగా జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతమైన ప్లేయర్. వీరుముగ్గరు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్‌కు తిరిగుండదు అని శ్రీశాత్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment