టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథనాయికిగానూ, విలన్‌గానూ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న గొప్ప నటి. ఒక హీరోయిన్ విలన్ పాత్రలో నటిస్తే తన విలువ పడిపోతుందేమోనని చేసేందుకు ముందుకు రాని ఆ కాలంలో అలవోకగా చేసి ఆ అపోహను పారద్రోలింది. ఇలా రెండు పాత్రల ద్వారా ఎక్కువ ఆఫర్లు అందుకుని విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరో తల్లిపాత్రల్లోనూ కూడా అంతే గ్లామర్‌గా అదే ఫిట్‌నెస్‌తో అలరిస్తోంది. కుర్ర హీరోయిన్‌లకు తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఈ అందాల భామ వన్నెతరగని అందం వెనుకున్న రహస్యాన్ని ఆమె కుటుంబ సభ్యుడు, డాక్టర్ గుగనాథ్ శివకదక్షమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అదెంటో తెలుసుకుందామా..!.
ఐదు పదుల వయసు దాటిన తర్వాత లీన్ కండరం అనేది బంగారం కంటే విలువైనదని చెబుతున్నారు కార్డియాలజిస్ట్ వైద్యుడు శివకదక్షమ్(Guganath Sivakadaksham). మెడిటేరియన్ డైట్(అడపాదడపా ఉపవాసం)తో బాడీని ఫిట్‌గా ఉంచుతుందని చెప్పారు. అందాల బామ రమ్యకృష్ణ(Ramya Krishnan) కూడా ఈ డైట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. అలాగే నటి రమ్య యోగా, తేలికపాటి కార్డియో వెయిట్ ట్రైనింగ్‌లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు.
ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటుందట. అలాగే వర్కౌట్‌లలో తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుందని అన్నారు. ఇవి ఆమె కండరాలను బలోపేతం చేసి మజిల్స్(muscle) స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయట. అందువల్ల ఆమె బాడీ షేప్‌అవుట్ అవ్వకుండా ఉందని చెప్పారు.
అలాగే యాభై ఏళ్లు దాటక బాడీలో లీన్ కండర ద్రవ్యరాశి తగ్గి ఎముకలు పటుత్వం కోల్పోయి శరీరం ఆకృతి మారిపోతుందట. అందువల్ల ఇలాంటి శక్తిమంతమైన వ్యాయమాలతో కండరాలను బలోపేతం చేసుకుంటే ఎముకలకు సంబంధించిన గాయాలను నివారించగలుగుతామని అన్నారు. ముఖ్యంగా మహిళలకు మెనోపాజ్ దశ(menopause)లో ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. అందువల్ల ఇవి తప్పనరిగా చేయాల్సిన పవర్‌ఫుల్ వ్యాయామాలు. అంతేగాదు ప్రతి సెషన్‌లో ఈవ్యాయామాలు కనీసం 6-12 సార్లు రిపీట్ చేయాలన్నారు. తద్వారా కండరాల క్షీణతను నివారించగలమని తెలిపారు. దీంతోపాటు అందుకు తగ్గా డైట్ కూడా ఉండాలన్నారు
డైట్(diet)..
పోషకాహారం పరంగా కండరాల మరమత్తు, పెరుగుదలకు తోడ్పడేలా అధిక ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. కోళ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తప్పనిసరిగా డైట్‌లో భాగమయ్యేలా చూడాలి. ఈ వ్యాయామాలను శిక్షగా కాకుండా శరీరాన్ని పిట్‌గా ఉంచేలా ఎంజాయ్ చేస్తూ చేయాలని చెబుతున్నారు.
ఎక్కువ కండరాల ద్రవ్యరాశి అనేది కీళ్ల పనితీరు, కదలిక సామర్థ్యాలను పెంచుతుంది. అలాగే ఇది బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుందట. అంతేగాదు ఇది మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను దూరం చేస్తుందని చెబుతున్నారు వైద్యుడు శివకదక్షమ్ . కాబట్టి యాభైలలో కూడా ఫిట్‌గా, గ్లామర్‌గా ఉండేలా అందాల భామ రమ్య కృష్ణలా వర్కౌట్‌లే చేసేద్దాం, ఆరోగ్యంగా ఉందాం.
s
(చదవండి: మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!)
Comments
Please login to add a commentAdd a comment