ఆ పేరు మార్చకపోతే నా పేరుకే భంగం కలుగుతుంది అంటూ నటి నయనతార దర్శకుడిపై ఒత్తిడి చేయడంతో చిత్రం పేరు
ఆ పేరు మార్చకపోతే నా పేరుకే భంగం కలుగుతుంది అంటూ నటి నయనతార దర్శకుడిపై ఒత్తిడి చేయడంతో చిత్రం పేరు మార్చక తప్పలేదట. నయనతార నా మజాకా అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇంతకీ ఏమా టైటిల్, ఏమా కథ? వివరాల్లో కెళితే...అందాలభామ నయనతార తొలిసారిగా ఒక హారర్ చిత్రంలో నటిస్తున్నారు. అదీ ఒక ఒక వేశ్య పాత్రలో. అలాంటి పాత్రను చేయడానికి ఆమె అంగీకరించిందంటే దానికి ప్రత్యేకత ఏదో ఉండే ఉండాలి. ఇకపోతే ఈ క్రేజీ భామ నటిస్తున్న ఆ చిత్రం పేరు నైట్‌షో. చిత్ర కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఇందులో ఆమె సరసన యువ నటుడు ఆది నటించడం విశేషం.
అయితే నైట్‌షో అనే టైటిల్ నయనతార ఇమేజ్‌కు భంగం కలిగేదిగా ఉందని, అసలాపేరే బీ గ్రేడ్‌లో ఉందని ఆమె సన్నిహితులు చెవిలో జోగారట. దీంతో ఆ టైటిల్ మార్చమని చిత్ర దర్శక, నిర్మాతపై నయనతార ఒత్తిడి తీసుకువచ్చారని సమాచారం. నయనతార అంతటి హీరోయిన్ ఆదేశించడంతో దర్శక, నిర్మాతలకు పాటించక తప్పుతుందా? పైగా ప్రత్యామ్నాయ పేరును కూడా ఆ ముద్దుగుమ్మకే చూపించారట. నయనతార అజిత్‌తో తొలిసారిగా జత కట్టిన చిత్రం ఆరంభం. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆరంభంలో నయనతార పాత్ర పేరు మాయ. ఈ పేరునే నైట్‌షో చిత్రానికి ఖరారు చేయమని ఆమె చెప్పడంతో దర్శక, నిర్మాతలు అదే పేరును ఖరారు చేశారని యూనిట్‌వర్గాల మాట.