మాధవన్ చేతికి మెగాఫోన్? | Madhavan megaphone in hand? | Sakshi
Sakshi News home page

మాధవన్ చేతికి మెగాఫోన్?

Published Fri, Apr 11 2014 11:47 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

మాధవన్ చేతికి మెగాఫోన్? - Sakshi

మాధవన్ చేతికి మెగాఫోన్?

ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఘనత మాధవన్‌ది. చేసినవన్నీ దాదాపు సున్నితమైన పాత్రలే కాబట్టి, మాధవన్‌కి ‘చాక్లెట్ బాయ్’ ఇమేజ్ ఏర్పడింది. అడపా దడపా ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటిస్తుంటారాయన. 1997లో ‘ఇన్‌ఫెర్నో’ అనే చిత్రంలో ఓ చిన్న పాత్ర చేసిన మాధవన్, ఆ తర్వాత ఏడేళ్లకు ‘నథింగ్ బట్ లైఫ్’ అనే చిత్రంలో ముఖ్య పాత్ర చేశారు.
 
అనంతరం మూడేళ్లకు ‘దట్ ఫోర్ లెటర్ వర్డ్’ అనే చిత్రంలో నటించిన మాధవన్ ప్రస్తుతం ‘నైట్ ఆఫ్ ది లివింగ్ డెడ్’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే, హిందీలో ‘తను వెడ్స్ మను’ సీక్వెల్‌లో నటించడానికి అంగీకరించారు. నటుడిగా పూర్తిగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ దర్శకుడవ్వాలనే తన కలను నెరవేర్చుకోవ డానికి మాధవన్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
 
మూడేళ్లుగా ఓ కథ రాస్తున్నారట. ఆ కథ సంతృప్తినిచ్చిన నేపథ్యంలో తెరకెక్కిం చాలనుకుంటున్నారని వినికిడి. ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement