
రాత్రీ.. పగలూ.. కలిసే చోట!
నిశి రాత్రి వేళ.. నల్లటి ఆకాశంలో చందమామ. కింద పగటి పూట భానుడి వెలుగు కిరణాలతో తెల్లగా మెరిసిపోతున్న మేఘమాలికలు. భూ వాతావరణం చివరి అంచు, ఆకాశం కలిసేచోట నీలిరంగు మెరుపులు.. ఒకేసారి పగలూ, రేయీ కలిసిపోయి కనిపిస్తున్న ఈ చిత్రం అద్భుతంగా ఉంది కదూ! భూమి చుట్టూ 330 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న జర్మన్ వ్యోమగామి అలెగ్జాండర్ గెర్‌స్ట్ ఇటీవల ఈ ఫొటోను తీశారు.
ఇటీవల ఐఎస్‌ఎస్ శీతల వ్యవస్థకు మరమ్మతు చేసేందుకు బయటికి వచ్చి స్పేస్‌వాక్ చేసినప్పుడు అలెగ్జాండర్ తీసి పంపిన తన సెల్ఫీ(స్వీయచిత్రం) కూడా ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేసింది. అన్నట్టూ... భూమి వాతావరణం ప్రభావం వల్ల ఆకాశం మనకు నీలిరంగులో కనిపిస్తుంది. కానీ.. అంతరిక్షంలోకి వెళ్లి చూస్తే మాత్ర ం కనిపించేది నల్లటి
ఆకాశమే!