ఏటీఎంలకు పోటెత్తిన జనం
ఏటీఎంలకు పోటెత్తిన జనం
Published Sat, Dec 3 2016 9:11 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
- రాత్రి సమయాల్లో కూడా కేంద్రాల వద్ద క్యూ
- నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్న ఖాతాదారులు
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలో రాత్రిళ్లు సైతం ఏటీఎంలు జనంతో కిటకిటలాడుతున్నాయి. కేవలం ఎస్‌బీఐకి చెందిని నాలుగైదు ఏటీఎంలలో మాత్రమే నగదు పెడుతుండటంతో రాత్రివేలల్లో సైతం వీటికి జనం పోటెత్తుతున్నారు. రాత్రిపూట అయితే ఏటీఎం ల దగ్గర రద్దీ ఉండదు. కనీసం రూ.2500 అయినా తెచ్చుకోవచ్చని వచ్చిన వారు ఇక్కడి జానాన్ని చూ సి షాక్‌కు గురవుతున్నారు. అర్ధరాత్రి సైతం ఏటీఎంల దగ్గర 20 నుంచి 30 మీటర్ల మేర క్యూలైన్‌లుండటంతో బిత్తరపోతున్నారు. ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచీ, మెడికల్ కాలేజీల దగ్గర ఉన్న ఏటీఎంలకు రాత్రిళ్లు తాకిడిపెరిగింది. గంటల పాటు లైన్‌లో ఉన్నా చివరి నగదు కాళీ అవుతుండటంతో నగదు పెట్టేంత వరకు వెల్లేది లేదని ఏటీఎంల్లోనే కూర్చుంటున్నారు.
Advertisement