బోరుమనీ.. | Difficulties big notes | Sakshi
Sakshi News home page

బోరుమనీ..

Published Sat, Dec 31 2016 2:03 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

బోరుమనీ.. - Sakshi

బోరుమనీ..

జిల్లాలో ఒడవని పెద్ద నోట్ల కష్టాలు

బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద  కొనసాగుతున్న బారులు
నగదు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అత్యవసర సేవలకు అవస్థలు
50 రోజులు దాటినా అదే పరిస్థితి


జనగామ : ‘‘డిసెంబర్‌ 30వ తేదీ వరకు మాత్రమే కరెన్సీ కష్టాలు ఉంటాయి.. తర్వాత నుంచి అందరు ఎప్పటిలాగే బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు తీసుకోవచ్చు..’’ అని దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసి 50 రోజులు దాటినా జిల్లాలో నోటు పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎం సెం టర్ల వద్ద ఖాతాదారులు బారులు తీరుతూనే ఉంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. నల్లధనం వెలికితీత, నకిలీనోట్ల చెలామణి ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 8వ తేదీన పాత రూ.500, రూ1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి మొదలైన కరెన్సీ కష్టాలు నేటికి తీరడం లేదు. జిల్లాలోని 13 మండలాల్లో 22 జాతీ య బ్యాంకులు, 16 రీజినల్‌ రూరల్‌ బ్యాంకులు, 3 కో ఆపరేటివ్‌ బ్యాం కులు, 6 ప్రైవేట్‌ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాం కుల్లో సరిపడా డబ్బులు లేకపోవడంతో ఖాతాదారు లు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాం కులు తెరవక ముందే వందలాది  మంది గేట్ల ఎదుట క్యూ కడుతున్నారు. కాగా, ముందు నిలబడిన వారికే కొంత నగదు ఇస్తుండగా, వెనకాల వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది.

పలు చోట్ల నో క్యాష్‌ బోర్డులు..
జిల్లా కేంద్రంలోని ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, గ్రామీణ వికాస్‌ బ్యాంకులు శుక్రవారం ఖాతాదారులతో రద్దీగా మారాయి. గుండా మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్, నర్మెట మండల కేంద్రంలోని బ్యాంకు ఆఫ్‌ బరోడా ఎదుట భారీ లైన్లు కట్టారు. ఆయా ప్రాంతాల్లో ముందున్న వారికే నోట్లు రాగా.. వెనకున్న వారికి అందలేదు. తరిగొప్పులలోని గ్రామీణ వికాస్‌ బ్యాంకులో కేవలం 150 మందికి మాత్రమే ముందుగా టోకెన్లు ఇచ్చి మిగతా వారిని రేపు రమ్మని అధికారులు వెనక్కి పంపించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని సెంట్రల్‌ బ్యాంకులో ఉదయం పూటనే డబ్బుల కోసం ఖాతాదారులు బారులు తీరారు. రెండు గంటల తర్వాత అధికారులు ఇక్కడ నో క్యాష్‌ బోర్డు తగి లించారు. మూడు గంటల పాటు క్యూలో నిలబడినా ఫలితం లేకుండా పోయింది. గ్రామీణ వికాస్‌ బ్యాంకులోనే అదే దుస్థితి నెలకొంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ బ్యాం కులు రద్దీగా మారాయి. ఇక్కడ కేవలం రూ.6 వేలు మాత్రమే ఇచ్చారు. కొడకండ్ల ఎస్‌బీఐ బ్యాంకులో కేవలం రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు. రెండు గంటల పాటు లైన్‌లో నిలబడితే చేతికి ఇచ్చారు. దేవరుప్పుల ఆంధ్రా బ్యాంకులో బారులు తీరారు. ఖాతాదారులు ఎక్కు వ మందికి రావడంతో రద్దీగా మారిం ది. రఘునాథపల్లిలోని ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, గ్రామీణ వికాస్‌ బ్యాంకులు, పాలకుర్తిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, గ్రామీణ వికాస బ్యాంకుల్లో రెండు, మూడు గంటల పాటు క్యూలో నిలబడిన చేతిలోకి నోట్లు రాలేదు.

పనిచేయని ఏటీఎంలు..
పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి జిల్లాలోని ఏటీఎంలు పనిచేయడం లేదు. జిల్లాలో మొత్తం 33 ఏటీఎంలు ఉండ గా.. ఎక్కడ కూడా సరిగా పనిచేయడం లేదు. పలు ఏటీఎంల్లో అధికారులు క్యాష్‌ పెట్టడమే మానేశా రు. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌  ఏటీఎంలు మినహా ఎక్కడ పనిచేయడం లేదు.

డిపాజిట్లు తక్కువ.. విత్‌ డ్రాలు ఎక్కువ..
పాత నోట్లను డిపాజిట్‌ చేసేందుకు అధి కారులు శుక్రవారం చివరి గడువు విధించా రు. దీంతో కొంతమంది తమ వద్ద ఉన్న పాత రూ.500. రూ.1000 నోట్లను జమ చేసేందుకు బ్యాంకుల వద్దకు వచ్చారు. డిపాజిట్లు చేసేందుకు తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికి విత్‌ డ్రా కోసం వందల సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుల్లో క్యూ కట్టారు. సరి పడా నగదు లేకపోవడంతో నిరాశతో  వెనుదిరిగిపోయారు. మొత్తంగా సకాలంలో నగదు అందక ప్రజలందరూ బోరు‘మనీ’ విలపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement