అబిడ్స్ ఎస్బీహెచ్లో కిక్కిరిసిన జనం
బ్యాంకులు, ఏటీఎంల వద్ద అదే రద్దీ
కొనసాగుతున్న ఇబ్బందులు
మరింత దిగజారుతున్న వ్యాపారాలు
కరెన్సీ మార్పిడికి సిరాచుక్క విధానం
మొబైల్ ఏటీఎంలు ప్రారంభించిన ఎస్‌బీఐ
సిటీబ్యూరో కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. నగరంలోని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల పరిసరాలన్నీ బుధవారం కూడా భారీ క్యూలతో కన్పించారుు. కరెన్సీ కొరతతో అనేక బ్యాంకులు రూ.4500 బదులు రూ.4000తోనే సరిపెట్టారుు. రోజూ వచ్చేవారిని గుర్తించే దిశగా ఆధార్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేసిన బ్యాంకులు పరిమితి మేరకు నగదు మార్పిడి చేసుకున్న వ్యక్తులను తిప్పిపంపారుు. ఇదిలా ఉంటే కొన్ని ఏటీఎం కేంద్రాల్లో బుధవారం నుండి రూ.2000 కొత్త కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చారుు. అరుునా మెజారిటీ ఏటీఎంలలో రూ.100 నోట్లనే ఉంచారు. ఇప్పటికే నగరంలో రూ.1000, రూ.500 పాత నోట్లను డిపాజిట్ చేసుకుంటున్న బ్యాంకులు వాటి స్థానంలో అధికంగా రూ.2000 నోట్లను ప్రజలకు ఇస్తుండటంతో నగరంలో చిల్లర సమస్య రోజు రోజుకు ఎక్కువవుతోంది.
దీంతో బుధవారం ఏటీఎం కేంద్రాల్లో రూ.100 నోట్లనే అధికంగా ఉంచారు. రిజర్వు బ్యాంకు కొత్తగా విడుదల చేసిన రూ.500 నోటు ఇంకా నగరానికి సరిపడినంతా రాలేదు. ఇక నగరంలోని ఫోస్టాఫీసులకు నగదు కొరత ఏర్పడటంతో డిమాండ్ మేరకు నగదు మార్పిడిని చేయలేకపోయారు. బ్యాంకుల నుండి పోస్టాఫీసులకు తెస్తున్న కొత్త కరెన్సీ గంటల్లోనే అయిపోతోంది.