సంతాన లక్ష్మి.....
సంతాన లక్ష్మి.. పేరంటాలమ్మ
పెదకాకాని, : పెదకాకానిలోని పేరంటాలమ్మ తిరునాళ్లకు ఆలయూన్ని ముస్తాబు చేస్తున్నారు. 323వ తిరునాళ్ల మహోత్సవం నుంచి ఆరు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఉత్సవాలకు బొల్లి ఆవులను సిద్ధం చేస్తున్నారు. గ్రామ పుర వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.
తొలి సిడిమాను భాగవతులు
తిరిగే సంప్రదాయంతో..
పెదకాకానికి చెందిన దానబోయిన వెంకుతాత, నానమ్మ దంపతులు సంతానం కోసం కృష్ణాజిల్లా వుయ్యూరులోని పేరంటాలమ్మ తిరునాళ్లకు వెళ్లి మొక్కుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో వారికి సంతానం కలగడంతో తరువాత ఏడాది సిడిమాను తిరిగేందుకు వెళ్లారు. అయితే ఆ ఆలయంలో తొలి సిడిమాను భాగవతులు తిరిగే సంప్రదాయం ఉండటంతో వీరిని నిరాకరించారు. దీంతో వెంకుతాత నిరాశతో వెనుదిరిగాడు. అమ్మా నీ మహిమ చూపుతూ పెదకాకాని వస్తే ఆలయం నిర్మించి ప్రతిఏటా తిరునాళ్ల నిర్వహిస్తానని వేడుకున్నారు. అదేరోజు రాత్రి స్వప్నంలో అమ్మవారు రావడం అప్పటి గ్రామ జమీందారు మన్నవ కోనయ్య సహకారంతో ఆలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి తిరునాళ్ల మహోత్సవం నిర్వహిస్తున్నారు.
సిడిమాను ప్రదర్శన ప్రత్యేకత
సంతానం లేనివారికి సంతాన లక్ష్మిగా పేరంటాలమ్మ పేరొందింది. పేరంటాలమ్మ ఆలయంలో పూజలు చేసి సంతానం కలిగినవారు సిడిమాను తిరిగేలా మొక్కులు మొక్కుకుంటారు. సంతానం పొందినవారిలో భార్యగానీ, భర్త గానీ, పిల్లలుగానీ అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం పండ్లు, కాయలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంపలో కూర్చొని ఆలయం చుట్టూ సిడి తిరగడం ఆనవాయితీ. తరువాత పండ్లు, కాయలను భక్తులకు అందించడం, అవి అందుకున్నవారికి