
ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూడొద్దు
సినిమాలతో నిమిత్తం లేకుండా వార్తల్లో నిలవడం త్రిష ప్రత్యేకత. ఏదో ఒక విషయంలో ఎప్పటికప్పుడు లైమ్‌లైట్లో ఉంటూనే ఉంటారామె. రీసెంట్‌గా ధనుష్, త్రిష వ్యవహారం చెన్నయ్‌లో చర్చనీయాంశమైంది.
సినిమాలతో నిమిత్తం లేకుండా వార్తల్లో నిలవడం త్రిష ప్రత్యేకత. ఏదో ఒక విషయంలో ఎప్పటికప్పుడు లైమ్‌లైట్లో ఉంటూనే ఉంటారామె. రీసెంట్‌గా ధనుష్, త్రిష వ్యవహారం చెన్నయ్‌లో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ నైట్ పార్టీలో పాల్గొన్న కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు, గంటల తరబడి ఫోన్లలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనీ, వీరిద్దరి మధ్య నిన్న లేని అనుబంధమేదో అలుముకున్నదనీ సన్నిహిత వర్గాల భోగట్టా. నిజానికి వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలే లేవు. కానీ... త్రిషకు, ధనుష్‌కీ స్నేహం ఎలా కుదిరింది? అన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశమైన అంశం. ఈ వ్యవహారంపై చెన్నయ్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి.
వీటిని ధనుష్, త్రిష కూడా మొన్నటివరకూ లైట్‌గానే తీసుకున్నారు. అయితే... త్రిష మాత్రం ఇటీవలే ఈ ఫొటోలపై, ధనుష్‌తో అనుబంధంపై వివరణ ఇచ్చుకున్నారు. ‘‘సినిమాల్లో కలిసి నటిస్తేనే స్నేహం కుదరదు. మేమిద్దరం ఆర్టిస్టులం. ఇద్దరిదీ ఒకే ఇండస్ట్రీ. ఇది చాలదా ఫ్రెండ్‌షిప్ చేయడానికి. ధనుష్ నాకు చాలా ఏళ్లుగా ఫ్రెండ్. ఈ విషయం తన ఫ్యామిలీకి కూడా తెలుసు. తన వైఫ్‌కి కూడా. అనవసరంగా ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూడొద్దు’’ అని హితవు పలికారు త్రిష. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె.