సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని నైట్‌షెల్టర్ల స్థితిగతులపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సంబంధిత అధికారులతోసమీక్షించారు. కుటుంబాల కోసం నైట్‌షెల్టర్లను నడపడంపై శ్ర ద్ధ వహించాలని ఎల్జీ ఈ సందర్భంగా సూచించారు. నిరాశ్రయ కుటుంబాల్లో భద్రతా భావం కల్పించేందుకు ఇటువంటి చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి రెండో వారం నగరంలో చలి తీవ్రంగా ఉంటుందని, అందువల్ల అప్పటివరకు నిరాశ్రయులకు సేవలందించడంపై దృష్టి సారించాలని సూచించారు. కాగా నగరంలోని 249 నైట్‌షెలర్లలో నిరాశ్రయులు రాత్రిపూట తలదాచుకుంటున్నారు. వీటిలో మొత్తం 18,805 మంది ఆశ్రయం పొందే వీలుంది. నైట్ షెల్టర్లలో 91 శాశ్వత నిర్మాణాలు, 111 పోర్టాకేబిన్లు,37 టెంట్లు ఉన్నాయి. మరో తొమ్మిది డీడీఏ కమ్యూనిటీ సెంటర్లలో నడుస్తున్నాయి. వసుంధరా ఎన్‌క్లేవ్ నివాసితుల సంక్షేమ సంఘం (ఆర్‌డబ్ల్యూఏ) కూడా నైట్‌షెల్టర్ కోసం ఓ ప్లాట్‌ను ఇచ్చింది. నగరంలోని నైట్‌షెల్టర్లలో 20 షెల్టర్లు ప్రత్యేకంగా చిన్నారుల కోసం నడుస్తున్నాయి. మహిళల కోసం 19, కుటుంబాల కోసం 13 , వికలాంగుల కోసం రెండు నడుస్తున్నాయి.
నైట్‌షెల్టర్ల స్థితిగతులపై సమీక్ష
Published Mon, Jan 5 2015 11:04 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
Advertisement