
తెల్లబోయిన రాత్రి
శ్వేతవర్ణం ఉదయించింది. చీకటి చిన్నబోయింది. రంగు మారిన తనను తాను చూసుకుని రాత్రి ‘తెల్ల’బోయింది. సిటీలో శనివారం రాత్రి జరిగిన వైట్ ఈవెంట్... నైట్ లుక్‌ని అమాంతం మార్చేసింది. వేదిక నుంచి వేడుక దాకా అంతా తెలుపే పులుముకుని కొత్త వెలుగుల్ని విరజిమ్మింది. కార్పొరేట్ కుర్రాళ్ల నుంచి సెలబ్రిటీ స్టార్ల దాకా అందర్నీ గచ్చిబౌలి స్టేడియంకు రప్పించిన వైట్ సెన్సేషన్... తెల్లని డ్రెస్‌కోడ్‌లో పార్టీ పీపుల్‌కి పీస్‘ఫుల్’ కలర్ ఇచ్చింది.
ఆమ్‌స్టర్ డామ్ నుంచి తరలి వచ్చిన అద్భుతమైన ఆర్టిస్టుల ప్రదర్శనలు, ప్రపంచ టాప్ క్లాస్ డీజేల మ్యూజిక్ హోరు.. కలగలిసి ఈ సెన్సేషన్ ఓ మరపురాని స్వీట్ అండ్ వైట్ మెమరీ అని అతిథుల చేత అనిపించింది.
-సాక్షి, వీకెండ్ ప్రతినిధి